Webdunia - Bharat's app for daily news and videos

Install App

మాజీ సీఎం కేసీఆర్ త్వరలోనే జైలుకు వెళతారు : బీజేపీ నేత రఘునందన్ రావు

వరుణ్
శుక్రవారం, 12 ఏప్రియల్ 2024 (15:19 IST)
భారత రాష్ట్ర సమితి అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ త్వరలోనే జైలుకు వెళతారని బీజేపీ నేత, మెదక్ లోక్‌సభ అభ్యర్థి రఘునందన్ రావు జోస్య చెప్పారు. ఆయన మెదక్ పట్టణంలోని చిల్డ్రన్ పార్కులో బీజేపీ పార్లమెంట్ నియోజకవర్గ బూత్ అధ్యక్షుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా రఘునందన్ మాట్లాడుతూ... పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ పూర్తిగా మునిగిపోవడం ఖాయమన్నారు. బీఆర్ఎస్ మునిగిపోతున్న టైటానిక్ పడవ వంటిదన్నారు. మెదక్ పార్లమెంట్ నుంచి జై తెలంగాణ అన్నవాళ్లకు బీఆర్ఎస్ టిక్కెట్ ఇవ్వలేదని విమర్శించారు. మెదక్‌లో తెలంగాణవాదులు అభ్యర్థులుగా దొరకలేదా అని ప్రశ్నించారు.
 
ప్రజలు ఓటేసి గెలిపించరని భావించిన బీఆర్ఎస్... సూట్‌కేసుల్లో పైసలు ఉన్న వెంకట్రామి రెడ్డికి టిక్కెట్ ఇచ్చిందని వ్యాఖ్యానించారు. కేసీఆర్ కాళ్లు మొక్కి ఒక్కరూపాయి ఖర్చు లేకుండా వెంకట్రామి రెడ్డి ఎమ్మెల్సీ అయ్యారన్నారు. వరి వేస్తే ఉరి అన్న వెంకట్రామి రెడ్డి మెదక్‌కు వచ్చి రైతుల ఓట్లు ఎలా అడుగుతాడు? అని ప్రశ్నించారు.
 
ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్ డబ్బులు పంచితే వారిని తరిమి కొట్టాలని పిలుపునిచ్చారు. సిద్దిపేట నుంచి హరీశ్ రావును బీట్ చేసే స్థాయిలో ఓట్లు వస్తాయని ధీమా వ్యక్తం చేశారు. తనకు ఒక్క ఓటు ఎక్కువొచ్చినా సిద్దిపేట నుంచి హరీశ్ రావును కరీంనగర్‌కు పంపిస్తానన్నారు. ముఖ్యమంత్రిగా ఉండి ఏం చేయవచ్చునో ఫోన్ ట్యాపింగ్ ద్వారా కేసీఆర్ చెప్పారని ఎద్దేవా చేశారు. నాలుగు పార్టీలు మారిన వ్యక్తికి కాంగ్రెస్ టికెట్ ఎలా ఇచ్చింది? అని నిలదీశారు. మెదక్ లో బీజేపీ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చిరంజీవి విశ్వంభర చిత్రంలో ఐదుగురు హీరోయిన్లా? దర్శకుడు ఏమంటున్నారు

రిసార్టులో హంగామా సృష్టించిన సినీ నటి కల్పిక

Payal Rajput: పాయల్ రాజ్‌పుత్ ఇంట తీవ్ర‌ విషాదం-ఆమె తండ్రి క‌న్నుమూత‌

'ఆర్ఎక్స్-100' హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్‌కు పితృవియోగం

రాజాసాబ్ నుంచి సంజూ బాబాకు శుభాకాంక్షలు తెలుపుతూ సంజయ్ దత్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments