ఖాకీల సమయస్ఫూర్తి .. ఆత్మహత్యకు యత్నించిన యువతిని కాపాడారు..

ఠాగూర్
గురువారం, 6 ఫిబ్రవరి 2025 (21:54 IST)
హైదరాబాద్, రాచకొండ కమిషనరేట్ పరిధిలోని బాలాపూర్‌లో ఆత్మహత్యకు ప్రయత్నించిన ఓ యువతిని పోలీసులు సకాలంలో స్పందించి ప్రాణాలు రక్షించారు. బాలాపూర్‌ గ్రామంలోని ఓ యువతి ఆత్మహత్యాయత్నం చేసిందంటూ గురువారం ఉదయం 9.45 గంటలకు బాలాపూర్‌ పోలీసులకు డయల్ 100 ద్వారా ఓ ఫోన్ కాల్ వచ్చింది. ఆ సమయంలో బాలాపూర్ పీఎస్‌లో విధుల్లో ఉన్న రాజు రెడ్డి, ఎస్ తరుణ్ అనే కానిస్టేబుళ్లు 5 నిమిషాల వ్యవధిలోనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. 
 
అక్కడికి వెళ్ళి  చూసిన ఆ ఇద్దరు కానిస్టేబుళ్లు ఓ యువతి గది లోపలి నుంచి గడియపెట్టుకున్నట్టు గుర్తించారు. ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా తలుపులు బద్దలు కొట్టి ఆ యువతిని కాపాడారు. ఆమె ఆత్మహత్యాయత్నాన్ని విరమింపజేశారు. ఆమెకు, ఆమె కుటుంబ సభ్యులకు కౌన్సెలింగ్ ఇచ్చారు. దీనికి సంబంధించిన వీడియోను రాచకొండ పోలీస్ సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేశారు. 
 
ఈ ఇద్దరు కానిస్టేబుళ్లు సత్వర స్పందన వారి అంకితభావం ఓ విలువైన ప్రాణాన్ని నిలబెట్టిందంని ఆ పోస్టులో కొనియాడారు. ఎవరైనా కష్టాల్లో ఉన్నపుడు ఆత్మహత్య ఆలోచనలు చేయకుండా తమకు ఇష్టమైన వారితో మాట్లాడి, వారి సాయం తీసుకోవాలని సూచించారు. అత్యవసర సమయాల్లో డయల్ 100కి కాల్ చేయొచ్చని, 87126 62111 అనే నంబరు ద్వారా వాట్సాప్‌లో సంప్రదించవచ్చని ఆ పోస్టులో సూచించారు. 


 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Rachakonda Cop (@rachakondacop)

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varanasi: వారణాసిలో జూనియర్ ఎన్టీఆర్ కుమారుడు భార్గవ్.. రోల్ ఏంటో తెలుసా?

ఆస్కార్స్ 2026లో ఉత్తమ యానిమేటెడ్ ఫీచర్ విభాగంలో మహావతార్ నరసింహ

Anupama: అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ యాక్ష‌న్ కామెడీ ది పెట్ డిటెక్టివ్‌ జీ 5లో

Balakrishna: హిస్టారికల్ ఎపిక్ నేపథ్యంలో నందమూరి బాలకృష్ణ NBK111 గ్రాండ్ గా లాంచ్

నిజాయితీ కి సక్సెస్ వస్తుందని రాజు వెడ్స్ రాంబాయి నిరూపించింది : శ్రీ విష్ణు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సీతాఫలం పండును ఎవరు తినకూడదు... తింటే విషం తీసుకున్నట్టే?

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Mint For Weight Loss: మహిళలు ఈజీగా బరువు తగ్గాలంటే.. పుదీనాను ఇలా వాడాలట..

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

పెద్దపేగు కేన్సర్‌కు చెక్ పెట్టే తోక మిరియాలు

తర్వాతి కథనం
Show comments