Ponguleti: వారికి రూ.5 లక్షలు ఇస్తాం... తెలంగాణ రెండ‌వ రాజ‌ధానిగా వరంగల్

సెల్వి
శనివారం, 26 జులై 2025 (20:07 IST)
Ponguleti
మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కీలక ప్రకటన చేశారు. చారిత్రాత్మక వ‌రంగ‌ల్ న‌గ‌రాన్ని తెలంగాణ రెండ‌వ రాజ‌ధానిగా చేయాల‌న్నదే ప్రభుత్వ సంక‌ల్పమన్నారు. గ‌తంలో ఎన్నడూ లేని విధంగా వ‌రంగ‌ల్ న‌గ‌రాభివృద్దికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. 
 
వ‌రంగ‌ల్ ప్రాంత ప్రజల చిర‌కాల స్వ‌ప్నం మామునూరు ఎయిర్ పోర్ట్ త్వ‌ర‌లో సాకారం కానుందని మంత్రి తెలిపారు. 2057 జ‌నాభాను దృష్టిలో పెట్టుకొని రూ. 4170 కోట్లతో వ‌రంగ‌ల్ నగరంలో అండ‌ర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవ‌స్ధ ఏర్పాటు చేయనున్నామని చెప్పారు. 
 
యుద్ధ ప్రాతిప‌దికన ఎయిర్ పోర్ట్‌కు అవ‌స‌ర‌మైన భూ సేక‌ర‌ణ చేపడుతామని, ఇందుకోసం 205 కోట్ల రూపాయలు గ్రీన్ ఛానల్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం విడుద‌ల చేసిందని పొంగులేటి చెప్పుకొచ్చారు. వరంగ‌ల్ జిల్లాలో క్రికెట్ స్టేడియానికి అవ‌స‌ర‌మైన  భూమి గుర్తింపు చేపట్టాలని అధికారులను ఆదేశించారు
 
అలాగే అసంపూర్తిగా ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణానికి రూ.5లక్షలు ఇస్తామన్నారు పొంగులేటి. ఇండ్లను పూర్తిచేసుకోవ‌డానికి ప్రభుత్వమే ల‌బ్దిదారుల‌కు ఆర్ధిక స‌హాయం చేస్తుందన్నారు. అర్హత కలిగిన లబ్ధిదారులు ఆగస్టు 15లోపు ఇళ్లు కేటాయించాలని కలెక్టర్లను ఆయన ఆదేశించారు. ఎప్పుడు దరఖాస్తు చేశారనేది కాకుండా నిజమైన పేదలకు మాత్రమే ప్రాధన్యత ఇవ్వాలన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన బాలీవుడ్ నటి పరణీతి చోప్రా

అవార్డులను చెత్త బుట్టలో పడేస్తా : హీరో విశాల్

Meesala Pilla: చిరంజీవి చరిష్మా అలాంటింది.. ఇండియన్ టాప్ ట్రెండింగ్‌లో మీసాల పిల్ల (video)

ఆర్టిస్టుల సమస్యలను దాటి తెరకెక్కిన పండంటి కాపురం ఒక తెలుగు క్లాసిక్

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇంట్లో దీపావళి పార్టీ కారణం అదే..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

తర్వాతి కథనం
Show comments