Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫోన్ ట్యాపింగ్ కేసు.. భారాస మాజీ ఎమ్మెల్యేలకు నోటీసులు

ఠాగూర్
మంగళవారం, 12 నవంబరు 2024 (16:51 IST)
తెలంగాణ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో తాజాగా ఓ ట్విస్ట్ చోటు చేసుకుంది. ఈ కేసుకు సంబంధించి విపక్ష భారత రాష్ట్ర సమితికి చెందిన నలుగురు మాజీ ఎమ్మెల్యేలకు పోలీసులు నోటీసులు జారీచేశారు. సోమవారం నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత చిరుమర్తి లింగయ్యకు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. మంగళవారం ఉమ్మడి నల్గొండ, మహబూబ్ నగర్‌కు చెందిన బీఆర్ఎస్ సీనియర్ నేతలు, మాజీ ఎమ్మెల్యేలు కూడా నోటీసులు అందుకున్నట్లు సమాచారం.
 
ఫోరెన్సిక్ రిపోర్ట్ లభించిన క్లూస్ ద్వారా వీరికి నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్ ముఖ్యనేత, మాజీ మంత్రి కేటీఆర్ ఢిల్లీ పర్యటనలో ఉండగా రాష్ట్రంలో చోటుచేసుకున్న ఈ పరిణామం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఎప్పుడు ఎవరికి నోటీసులు వస్తాయోనని బీఆర్ఎస్ నేతలు ఆందోళన చెందుతున్నారు.
 
అమృత్ టెండర్లలో తెలంగాణలోని అధికార కాంగ్రెస్ పార్టీ అవినీతికి పాల్పడిందని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. ఈ విషయమై కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేయడానికి కేటీఆర్ ఢిల్లీకి వెళ్లారు. కేంద్ర మంత్రులను కలిసి తెలంగాణ సర్కార్ పై ఫిర్యాదు చేయనున్నారు.
 
మరోవైపు, ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడిగా పోలీసులు పేర్కొన్న ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు అమెరికాకు పారిపోయిన సంగతి తెలిసిందే. అమెరికా టూర్‌లో ఉన్నానని, ఇండియాకు తిరిగి వచ్చిన తర్వాత విచారణకు హాజరవుతానని ప్రభాకర్ రెడ్డి పోలీసులకు సమాచారం ఇచ్చారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బోల్డ్‌గా నటిస్తే అలాంటోళ్లమా? అనసూయ ప్రశ్న

తెలుగు, హిందీ భాషల్లో రాబోతోన్న సట్టముమ్ నీతియుమ్

ఏలుమలై నుంచి సిధ్ శ్రీరామ్ ఆలపించిన రా చిలకా మెలోడీ సాంగ్

Prabhas: ప్రభాస్ కొత్త లుక్ తో పూరి జగన్నాథ్, ఛార్మికి పలుకరింపు

మెగాస్టార్ చిరంజీవి తో డాన్స్ ఆనందంతోపాటు గౌరవంగా వుంది : మౌని రాయ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తీపి మొక్కజొన్న తింటే?

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

తర్వాతి కథనం
Show comments