Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహా న్యూస్ చానెల్‌‍పై దాడిని తీవ్రంగా ఖండించిన పవన్ కళ్యాణ్

ఠాగూర్
శనివారం, 28 జూన్ 2025 (17:23 IST)
హైదరాబాద్ నగరంలోని మహా న్యూస్ చానెల్ ప్రధాన కార్యాలయంపై బీఆర్ఎహైదరాబాద్ నగరంలోని మహా న్యూస్ చానెల్ ప్రధాన కార్యాలయంపై బీఆర్ఎస్ పార్టీకి చెందిన కార్యకర్తలు శనివారం దాడికి తెగబడ్డారు. ఈ దాడిలో కార్లతో పాటు కార్యాలయం పూర్తిగా ధ్వంసమైంది. అలాగే, మీడియా సిబ్బందిపై భౌతిక దాడులకు జరిగాయి. వీటిని ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు ఆయన శనివారం ఓ పత్రికా ప్రకటన విడుదల చేశారు. 
 
స్ పార్టీకి చెందిన కార్యకర్తలు శనివారం దాడికి తెగబడ్డారు. ఈ దాడిలో కార్లతో పాటు కార్యాలయం పూర్తిగా ధ్వంసమైంది. అలాగే, మీడియా సిబ్బందిపై భౌతిక దాడులకు జరిగాయి. వీటిని ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు ఆయన శనివారం ఓ పత్రికా ప్రకటన విడుదల చేశారు. 
 
మీడియా సంస్థలు ప్రసారం చేసే వార్తలు లేదా కథనాలపై ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే వాటిని తెలియజేయడానికి నిర్ధిష్టమైన, ప్రజాస్వామ్యబద్ధమైన పద్ధతులు ఉంటాయని పవన్ కళ్యాణ్ గుర్తుచేశారు. ఆ మార్గాలను అనుసరించకుండా నేరుగా కార్యాలయాలపై దాడులకు దిగడం ఏమాత్రం సమంజసం కాదని ఆయన స్పష్టం చేశారు. ఇలాంటి చర్యలు ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమన్నారు.  
 
మహా న్యూస్ చానెల్‌పై జరిగిన దాడిని ప్రజాస్వామ్యాన్ని గౌరవించే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఖండించాలని ఆయన పిలుపునిచ్చారు. మీడియా గొంతును నొక్కే ఇలాంటి ప్రయత్నాలను సహించరాదని ఆయన పేర్కొన్నారు. ఈ ఘటనపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. దాడికి బాధ్యులైన వారిని గుర్తించి, వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. భవిష్యత్‌లో ఇలాంటి సంఘటనలు పునరావృత్తం కాకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కోరారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ది గర్ల్ ఫ్రెండ్ లో ఏం జరుగుతోంది.. అంటూ చెబుతున్న రశ్మిక మందన్న

GAMA: గామా అవార్డ్స్ లో స్పెషల్ పెర్ఫామర్ గా ఫరియా అబ్దుల్లా

Vishal: సముద్రం మాఫియా కథ తో విశాల్ 35వ చిత్రం మకుటం

balakrishna: వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ హీరో నందమూరి బాలకృష్ణకు పవన్ కళ్యాణ్ అభినందలు

తెలుగు చిత్రపరిశ్రమను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లడమే ధ్యేయం : సీఎం రేవంత్ రెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లెమన్ గ్రాస్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

అల్లం టీ తాగితే అధిక బరువు తగ్గవచ్చా?

శక్తినిచ్చే ఖర్జూరం పాలు, మహిళలకు పవర్ బూస్టర్

అబోట్ నుంచి నిరంతర గ్లూకోజ్ రీడింగులు అలర్ట్‌లతో కూడిన నెక్స్ట్-జెన్ ఫ్రీస్టైల్ లిబ్రే 2 ప్లస్‌

ఈ ఆయుర్వేద సూపర్‌ఫుడ్‌లతో రుతుపవనాల వల్ల వచ్చే మొటిమలకు వీడ్కోలు చెప్పండి

తర్వాతి కథనం
Show comments