No pay no work: జీతం లేనిదే పని చేసేది లేదు.. అవుట్‌సోర్సింగ్ ఉద్యోగుల నిరసన

ఠాగూర్
మంగళవారం, 2 సెప్టెంబరు 2025 (20:17 IST)
Protest
తెలంగాణ మోడల్ స్కూల్స్‌కు చెందిన వందలాది మంది అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులు మంగళవారం డైరెక్టరేట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ వద్ద తమ జీతాలు చెల్లించకపోవడంతో భారీ నిరసన చేపట్టారు. ఫిజికల్ డైరెక్టర్లు, కంప్యూటర్ ఆపరేటర్లు, అటెండర్లు, వాచ్‌మెన్‌లతో కూడిన ఉద్యోగులు తమ పిల్లలను మోసుకుంటూ డైరెక్టరేట్‌ను ముట్టడించారు.
 
దీనిపై నిరసనకారులు మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం గత ఆరు నెలలుగా తమ జీతాలు చెల్లించలేదు. ప్రస్తుతం, 194 మోడల్ స్కూల్స్‌లో 776 మంది అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులు పనిచేస్తున్నారు. జీతాలు లేకుండా ఆరు నెలలు గడిచాయి. మా కుటుంబాలకు వారి రోజువారీ అవసరాలను తీర్చడం కష్టతరం అవుతోంది.. అని తెలంగాణ మోడల్ స్కూల్స్ ఫిజికల్ డైరెక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఆంజనేయులు అన్నారు.
 
ఈ అంశంపై డైరెక్టరేట్ అధికారులు సెప్టెంబర్ 8 నాటికి వారి జీతాలు విడుదల చేస్తామని నిరసనకారులకు హామీ ఇచ్చారు. సమ్మె నోటీసు అందించిన ఉద్యోగులు, సెప్టెంబర్ 8 నాటికి జీతాలు జమ చేయకపోతే తమ పనిని బహిష్కరించి నిరవధిక సమ్మెకు దిగుతామని హెచ్చరించారు.
 
ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు సంఘీభావం తెలుపుతూ, తెలంగాణ మోడల్ స్కూల్స్ టీచర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు యాకమల్లు ప్రభుత్వాన్ని ఉద్యోగుల జీతాలను వెంటనే విడుదల చేయాలని కోరారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Purush: భిన్నమైన క్యాప్షన్స్, పోస్టర్‌లతో డిఫరెంట్ మూవీ పురుష

Prerna Arora: ఆరెంజ్ స్పూర్తితో తెలుగు సినిమా చేశా - జటాధర బ్లాక్ మ్యాజిక్ కథ : నిర్మాత ప్రేరణ అరోరా

Aadi Saikumar: శంబాల ఏ ఒక్కరినీ నిరాశపర్చదు : ఆది సాయికుమార్

సింగర్ రామ్ మిరియాల పాడిన టైటిల్ సాంగ్ సంతాన ప్రాప్తిరస్తు

Mahesh Chandra: పిఠాపురంలో అలా మొదలైంది అంటోన్న దర్శకుడు మహేష్‌చంద్ర

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అధిక రక్తపోటుతో బాధపడేవారు ఈ పని చేయండి

బరువు పెరగాలనుకునేవారు ఈ 5 పదార్థాలు తింటే చాలు...

ఔషధంలా ఉపయోగపడే లవంగాలు, ఏమేమి ప్రయోజనాలు?

అదేపనిగా సెల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల ముందు కూర్చుంటున్నారా?

రోగనిరోధక శక్తిని పెంచే హెర్బల్ టీలు

తర్వాతి కథనం
Show comments