Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిరు వ్యాపారి కుటుంబాన్ని చిదిమేసిన వడ్డీ వ్యాపారులు...

ఠాగూర్
గురువారం, 7 నవంబరు 2024 (12:58 IST)
తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్ జిల్లాలో వడ్డీ వ్యాపారులు ఓ చిరు వ్యాపారి కుటుంబాన్ని చిదిమేశారు. తీసుకున్న అప్పులతో పాటు వాటికి వడ్డీలు చెల్లించలేక, వడ్డీ వ్యాపారుల ఒత్తిళ్లు భరించలేక ఓ కుటుంబం గోదావరి నదిలో దూకి అత్మహత్య చేసుకుంది. ఈ విషాదకర ఘటన నిర్మల్ జిల్లా బాసర వద్ద జరిగింది. ఈ ఘటనపై చిరు వ్యాపారి ప్రాణాలు కోల్పోగా, ఆయన భార్య మాత్రం సురక్షితంగా ప్రాణాలతో బయటపడ్డారు. వారి కుమార్తె మాత్రం గల్లంతయ్యారు. దీంతో ఆమె చనిపోయివుంటుదని భావిస్తున్నారు. 
 
పోలీసుల కథనం మేరకు.. యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరుకు చెందిన ఉప్పలించి వేణు (54) తన భార్య అనూరాధ, ఇద్దరు కుమార్తెలతో కలిసి ఇరవై ఏళ్ల కిందట నిజామాబాద్‌కు బతుకుతెరువు కోసం వచ్చారు. న్యాల్‌కల్ రహదారి పక్కన కాలనీలో నివసిస్తూ.. పాన్‌షాపు నడుపుతున్నారు. కొంతకాలంగా దుకాణం సక్రమంగా నడవకపోవడంతో కుటుంబ పోషణ ఇబ్బందిగా మారింది. దీంతో స్థానిక వడ్డీ వ్యాపారుల వద్ద రూ.3 లక్షల అప్పుతో పాటు వడ్డీని కూడా సక్రమంగా చెల్లిస్తున్నారు. 
 
కాగా తీసుకున్న డబ్బు వెంటనే చెల్లించాలంటూ ఇటీవల అప్పులిచ్చినవారు ఇబ్బందులకు గురిచేశారు. గడువు ఇవ్వాలని కోరినా వినకుండా వేధింపులకు పాల్పడ్డారు. తన చిన్నకుమార్తె పూర్ణిమ (25)కు పెళ్లిచూపులు జరిగాయని, అప్పు తీర్చడానికి సమయం ఇవ్వాలని వేడుకున్నా వారు వినలేదు. దీంతో మనస్తాపానికి గురైన వేణు, తన భార్య, కుమార్తెతో కలిసి ద్విచక్రవాహనంపై బుధవారం వేకువజామున బాసరకు వచ్చి.. గోదావరి వంతెన పైనుంచి నదిలో దూకారు. అనూరాధ నీటి ప్రవాహానికి మొదటి స్నానాలఘాట్ వరకు కొట్టుకొచ్చారు. 
 
స్థానిక గంగపుత్రులు, భక్తులు ఆమెను కాపాడి పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే ముథోల్ సీఐ మల్లేశ్, బాసర, ముథోల్ ఎస్ఐలు గణేశ్, సాయికిరణ్ అక్కడికి చేరుకొని అనూరాధతో మాట్లాడి వివరాలు సేకరించారు. ఆమె భర్త, కుమార్తె కోసం గాలించగా వేణు మృతదేహం లభ్యమైంది. పూర్ణిమ గల్లంతు కావడంతో ఆమె కోసం గాలిస్తున్నారు. అప్పులిచ్చిన వడ్డీ వ్యాపారుల కోసం బాసర పోలీసులు నిజామాబాద్ వెళ్లగా.. వారు పరారైనట్లు తెలిసింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varun Tej: వరుణ్ తేజ్ హీరోగా ఇండో-కొరియన్ హారర్-కామెడీ చిత్రం

'కన్నప్ప'ను ట్రోల్ చేస్తే శివుని ఆగ్రహానికి శాపానికి గురవుతారు : రఘుబాబు

నందమూరి బాలకృష్ణ ఆదిత్య 369 రీ రిలీజ్ విడుదల తేదీ మార్పు

Suhas: స్పిరిట్ లో పాత్ర ఫైనల్ కాలేదు, విలన్ పాత్రలంటే ఇష్టం : సుహాస్

David Warner : రాజేంద్రప్రసాద్ వ్యాఖ్యలకు క్రికెటర్ డేవిడ్ వార్నర్‌ సీరియస్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన ఆహారాలు

మహిళల్లో కేన్సర్ ముప్పుకు కారణం అదేనా?

Summer Drinks: పిల్లలకు వేసవిలో ఎలాంటి ఆరోగ్యకరమైన జ్యూస్‌లు ఇవ్వాలి?

White Pumpkin Juice: పరగడుపున తెల్ల గుమ్మడికాయ రసం-ఒక నెలలో ఐదు కిలోల బరువు డౌన్

తర్వాతి కథనం
Show comments