విజయలక్ష్మి విల్లాలు, కాస్త చూసి కొనండయ్యా, లేదంటే కోట్లు కొట్టుకుపోతాయ్

ఐవీఆర్
గురువారం, 30 జనవరి 2025 (16:10 IST)
Lakshmi Srinivasa Constructions MD Vijayalakshmi arrested
కళ్లకి ఇంపుగానూ, లోపలికి వెళ్తే స్వర్గంలానూ వుంటాయి ఆ విల్లాలు. మరీ అంత బాగుంటే కాస్త ధర ఎక్కువయినా కొనకుండా ఎలా వుంటాము. హాట్ కేకుల్లా ఎగిరిపోతున్నాయంటూ లక్షలకు లక్షలు అప్పు చేసి కొనేస్తుంటాము. ఐతే ఈ బలహీనతనే నిర్మాణరంగంలో వున్న కొంతమంది రియల్టర్లు క్యాష్ చేసుకుంటున్నారు.
 
ఇక అసలు విషయానికి వస్తే... మేడ్చల్ జిల్లా మల్లంపేటలో ఏకంగా ప్రభుత్వ భూమినే కబ్జా చేసి అందులో విల్లాలు నిర్మించారు లక్ష్మీశ్రీనివాస కన్స్ట్రక్షన్స్ ఎమ్.డి విజయలక్ష్మి. ఇలా నిర్మించిన విల్లా ఒక్కో దానికి కోట్ల రూపాయల్లో వసూలు చేసింది. ఐతే ప్రభుత్వ భూమిలో విల్లాలను నిర్మించినట్లు తేలడంతో ఇటీవల ఆ విల్లాలను హైడ్రా కూల్చేసింది. దీనితో విల్లాలు కొనుగోలు చేసినవారు లబోదిబోమంటూ పోలీసులకు ఫిర్యాదు చేసారు.

ఈరోజేమో శంషాబాద్ విమానశ్రయంలో కంపెనీ ఎమ్.డి గుర్రం విజయలక్ష్మిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అందుకే ఆస్తులను కొనే ముందు ఒకటికి పదిసార్లు పత్రాలను తనిఖీ చేసుకోవాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన బాలీవుడ్ నటి పరణీతి చోప్రా

అవార్డులను చెత్త బుట్టలో పడేస్తా : హీరో విశాల్

Meesala Pilla: చిరంజీవి చరిష్మా అలాంటింది.. ఇండియన్ టాప్ ట్రెండింగ్‌లో మీసాల పిల్ల (video)

ఆర్టిస్టుల సమస్యలను దాటి తెరకెక్కిన పండంటి కాపురం ఒక తెలుగు క్లాసిక్

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇంట్లో దీపావళి పార్టీ కారణం అదే..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

తర్వాతి కథనం
Show comments