Webdunia - Bharat's app for daily news and videos

Install App

KA Paul: చిన్నవాడైన రామ్మోహన్‌కి ఏవియేషన్‌పై అవగాహన లేదు: కే.ఏ.పాల్

సెల్వి
శుక్రవారం, 13 జూన్ 2025 (15:52 IST)
KA Paul
విమానయాన శాఖ ఎంతో క్లిష్టమైనది.. చిన్నవాడైన రామ్మోహన్ నాయుడికి ఏవియేషన్‌పై అవగాహన లేదని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అనుభవం లేని రామ్మోహన్ నాయుడు ఆ శాఖకు పనికిరాడని కేఏ పాల్ అన్నారు. 
 
ఏవియేషన్ అనుభవం ఉన్న ఎంపీకి విమానయాన శాఖను అప్పగించాలని డిమాండ్ చేశారు. రామ్మోహన్ నాయుడు వెంటనే రాజీనామా చేయాలన్నారు. అలాగే అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై పాల్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇది ఉగ్రవాదుల దాడి అయి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు.
 
ఈ దుర్ఘటనలో 242 మంది ప్రయాణికులు మరణించడం బాధాకరమని, దీనిపై వెంటనే విచారణ జరిపి బాధితులకు న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఎయిరిండియా విమానం కూలిపోయిన ఘటనలో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపాణి సహా 242 మంది మరణించారు.
 
ఈ ఘటనపై వెంటనే విచారణ చేయాలని, చనిపోయినవారికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఇలాంటి సంఘటన జరగడం దురదృష్టకరమని, ఈ ప్రమాదంలో చనిపోయినవారికి సంతాపం తెలిపారు. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఘోర విమాన ప్రమాదం జరిగింది. 
 
ఎయిరిండియా బోయింగ్ విమానం లండన్‌కు బయలుదేరింది. టేకాఫ్ అయిన కొద్దిసేపటికే కుప్పకూలి మంటల్లో కాలిపోయింది. ఈ ఘటనలో మొత్తం 242మంది చనిపోయారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చెత్త సినిమాలు ఎందుకు చేస్తున్నారంటూ ప్రశ్నిస్తున్నారు : అనుపమ

బడ్జెట్ రూ.40 కోట్లు.. కలెక్షన్లు రూ.210+ కోట్లు : 'మహవతార్ నరసింహా' ఉగ్రరూపం!!

నా కోసం ప్రభుత్వ వాహనం పంపలేదు... దానికి నాకూ ఎలాంటి సంబంధం లేదు : నిధి అగర్వాల్

ప్రభుత్వ వాహనంలో నిధి అగర్వాల్.. క్లారిటీ ఇచ్చిన హరిహర వీరమల్లు హీరోయిన్

Madhu Shalini : మధు శాలిని ప్రెజెంట్స్ కన్యా కుమారి రిలీజ్ కు సిద్ధం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Chapati Wheat Flour: ఫ్రిజ్‌లో చపాతీ పిండిని నిల్వ చేస్తే ఆరోగ్యానికి మేలు జరుగుతుందా?

మహిళలు వంకాయను తీసుకుంటే.. ఏంటి లాభం?

కూల్‌డ్రింక్స్ తాగితే పక్షవాతం తప్పదంటున్న వైద్య నిపుణులు

స్నాక్స్ గుగ్గిళ్లు తింటే బలం, ఇంకా ఏం ప్రయోజనాలు?

గౌరవ్ గుప్తా తన బ్రైడల్ కౌచర్ కలెక్షన్, క్వాంటం ఎంటాంగిల్‌మెంట్ ఆవిష్కరణ

తర్వాతి కథనం
Show comments