ఫోన్ ట్యాపింగ్‌తో తనకు సంబంధం లేదు.. బీజేపీలో చేరడం లేదు : ఎర్రబెల్లి దయాకర్

ఠాగూర్
మంగళవారం, 19 మార్చి 2024 (15:50 IST)
తాను పార్టీ మారనున్నట్టు సాగుతున్న ప్రచారంపై భారత రాష్ట్ర సమితి నేత ఎర్రబల్లి దయాకర్ రావు క్లారిటీ ఇచ్చారు. తాను పార్టీ మారడం లేదని స్పష్టం చేశారు. అలాగే, ఎస్.ఐ.బి మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు చేపట్టిన ఫోన్ ట్యాపింగ్‌ అంశంలో తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు. అసలు ఆయన ఎవరో తనకు తెలియదన్నారు. 
 
ట్యాపింగ్ అంశంలో తన పేరు చెప్పాలని ప్రణీత్ రావుపై అధికారులు ఒత్తిడి తెస్తున్నారని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ వంద రోజుల పాలన పూర్తిగా విఫలమైందన్నారు. ఆరు గ్యారెంటీలలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయలేదని అన్నారు. మోసాలు చేయడం, మాయ మాటలు చెప్పడం రేవంత్‌ రెడ్డికి అలవాటేనని అన్నారు. 
 
అలాగే, తాను పార్టీ మారబోతున్నట్టు సాగుతున్న ప్రచారంలో రవ్వంత కూడా నిజం లేదన్నారు. తమ అధినేత కేసీఆర్ నాయకత్వంలో పార్టీ అభివృద్ధి కోసం ఒక సైనికుడిలా పని చేస్తానని చెప్పారు. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఉమ్మడి వరంగల్, పాలకుర్తి నియోజకవర్గాల బీఆర్ఎస్‌ కేడర్‌ను బలహీన పరిచేందుకు ఇలాంటి ప్రచారం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. 
 
కార్యకర్తలను తప్పుదారి పట్టించేందుకే ఈ తరహా ప్రచారం సాగుతుందన్నారు. తాను బీజేపీలో చేరబోతున్నాననే వార్తల్లో నిజం లేదన్నారు. కావాలనే తనపై కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కౌబాయ్ చిత్రంలో నటిస్తానని ఊహించలేదు : చిరంజీవి

కొదమసింహం.. నాకు, రామ్ చరణ్ కు ఫేవరేట్ మూవీ - మెగాస్టార్ చిరంజీవి

జీవి ప్రకాష్ లాంచ్ చేసిన సుడిగాలి సుధీర్, దివ్యభారతి.. G.O.A.T నుంచి లవ్ సాంగ్

Kalyani Priyadarshan : కళ్యాణి ప్రియదర్శన్ ప్రధానపాత్రలో చిత్రం చెన్నైలో ప్రారంభం

ఓపిక, సహనం, జ్ఞానం, తెగింపు, పోరాటం అనేవి మ్యూజిక్ డైరెక్టర్ కు అర్హతలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments