Webdunia - Bharat's app for daily news and videos

Install App

బడా కాంగ్రెస్ నేతల ఫామ్ హౌజ్‌లను హైడ్రా కూల్చివేసేనా? (Video)

ఠాగూర్
ఆదివారం, 25 ఆగస్టు 2024 (17:52 IST)
హైదరాబాద్ నగరం చుట్టూత అనేక ఫామ్‌ హౌజ్‌లు వెలసివున్నాయి. వీటిలో కొన్ని సక్రమంగా నిర్మిస్తే, మరికొన్ని అక్రమంగా నిర్మించారు. ఇలాంటి వాటిలో చెరువులు, ప్రభుత్వ భూములను ఆక్రమించి నిర్మించినవే ఎక్కువగా ఉన్నాయి. ఇలాంటి వాటిలో తమ్మిడిగుంట చెరువును ఆక్రమించి నిర్మించిన ఎన్ కన్వెన్షన్ సెంటర్‌ను హైడ్రా కూల్చివేసింది. ఇది టాలీవుడ్ హీరో అక్కినేని నాగార్జునకు చెందిన కన్వెన్షన్ సెంటర్. దీంతో ఇపుడు హైదరాబాద్ నగర చుట్టుపక్కల అక్రమంగా నిర్మితమైన ఫామ్ హౌజ్‌లపై దృష్టిమళ్లింది. ఇలాంటి వాటిలో ఎక్కువగా బడా కాంగ్రెస్ నేతలకు చెందినవే ఎక్కువగా ఉన్నాయి. ఇపుడు అక్కినేని నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ సెంటర్‌ను కూల్చివేసినట్టుగానే వీటిని కూడా హైడ్రా కూల్చివేస్తుందా లేదా అన్న చర్చ ఇపుడు మొదలైంది. 
 
ఇలాంటి ఫామ్ హౌజ్‌ల వివరాలు ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వాటిలో కొన్ని.. హిమాయత్ సాగర్ చెరువులో ఎమ్మెల్సీ పట్నం మహేందర్ ఫామ్ హౌజ్ ఉండగా, హిమాయత్ సాగర్ చెరువులో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి చెందిన ఫామ్ హౌజ్, హిమాయత్ సాగర్ చెరువులో కాంగ్రెస్ ఎమ్మెల్యే, వీ6 ఛానల్ ఓనర్ ఫామ్ హౌజ్, హిమాయత్ సాగర్ చెరువులో ఎమ్మెల్సీ గుత్తా సుఖేందర్ రెడ్డి ఫామ్ హౌజ్‌లు ఉన్నాయి. ఇపుడు వీటిని కూల్చివేస్తారా లేదా అన్నది ఉత్కంఠ నెలకొంది.  


 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మదరాసి నుంచి శివకార్తికేయన్ లవ్ ఫెయిల్యూర్ యాంథమ్

మిత్ర మండలి నుంచి రెండవ గీతం స్వేచ్ఛ స్టాండు విడుదల

భగవత్ కేసరి , 12th ఫెయిల్ ఉత్తమ చిత్రం; షారుఖ్ ఖాన్, విక్రాంత్ మాస్సే ఉత్తమ నటుడి అవార్డు

జాతీయ చలన చిత్ర అవార్డులు - ఉత్తమ చిత్రంగా 'భగవంత్ కేసరి'

Satyadev: మత్స్యకారుల బతుకుపోరాటంగా అరేబియా కడలి ట్రైలర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

గుండె ఆరోగ్యానికి లేత చింతకాయ పచ్చడి, ఇంకా ఎన్నో ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments