Webdunia - Bharat's app for daily news and videos

Install App

విషయం చెప్పండి .. ఓవర్ యాక్షన్ చెయొద్దు : హైడ్రా కమిషనర్ రంగనాథ్ (Video)

ఠాగూర్
సోమవారం, 10 ఫిబ్రవరి 2025 (13:13 IST)
హైదరాబాద్ నగరంలోని అక్రమ నిర్మాణాలను తొలగించేందు ఆ రాష్ట్ర ప్రభుత్వం హైడ్రా పేరుతో ఓ స్వతంత్ర బాడీని ఏర్పాటు చేసింది. ఈ సంస్థకు కమిషనర్‌గా రంగనాథ్‌ను ప్రభుత్వం నియమించింది. ఆ తర్వాత ఆయన బాధ్యతలు చేపట్టిన తర్వాత అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం మోపుతున్నారు. హైడ్రా కమిషనర్‌పై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నప్పటికీ ఆయన మాత్రం ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. తన పని తాను చేసుకుంటూ వెళుతున్నారు. 
 
ఈ క్రమంలో సంగారెడ్డి జిల్లా అమీన్ పూర్ మున్సిపాలిటీలోని ఐలాపూర్ రాజగోపాల్ నగర్ అసోసియేషన్ సభ్యులతో హైడ్రా కమిషనర్ రంగనాథ్ సమావేశమయ్యారు. ముఖ్యంగా, ప్లాట్లు కొనుగోలు చేసిన బాధితుల అభిప్రాయాలను రంగనాథ్ తెలుసుకుంటున్నారు. ఆ సమయంలో ఐలాపూర్ గ్రామ వాసి, సుప్రీంకోర్టు న్యాయవాది ముఖీం... హైడ్రా కమిషనర్ రంగనాథ్‌తో మాట్లాడుతుండగా ఇరువురి మధ్య వాగ్వివాదం జరిగింది. 
 
ఆ సమయంలో తెలుగు వచ్చా అంటూ రంగనాథ్‌ను ముఖీం ప్రశ్నించారు. మీరు చెప్పేది మీరు చెప్పండి.. ఓవర్ యాక్షన్ చెయొద్దంటూ అంటూ ముఖీంను హైడ్రా కమిషనర్ రంగనాథ్ హెచ్చరించారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నాని హిట్3, సూర్య రెట్రో సినిమాల్లోనూ కామన్ పాయింట్స్ హైలైట్స్

ఈరోజు నుంచి ప్రతి రోజు హిట్ 3 సెలబ్రేషన్ లాగా ఉండబోతుంది: నాని

మరో మెగా వారసుడు రానున్నాడా? తల్లిదండ్రులు కాబోతున్న వరుణ్ - లావణ్య

మిథున్ చక్రవర్తి, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ నాకు స్పూర్తినిచ్చారు: చిరంజీవి

ఆశిష్ హీరోగా దిల్ రాజు, శిరీష్‌ నిర్మించనున్న చిత్రానికి దేత్తడి టైటిల్ ఖరారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మల్బరీ పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

లాసోడా పండ్లు ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయో తెలుసా?

Sitting Poses: గంటల గంటలు కూర్చోవడం వల్ల ఆరోగ్య సమస్యలు

వేసవిలో మహిళలు ఖర్జూరాలు తింటే ఏంటి ఫలితం?

నిమ్మ కాయలు నెలల తరబడి తాజాగా నిల్వ చేయాలంటే?

తర్వాతి కథనం
Show comments