Hyderabad: కూరగాయల కత్తితో భర్తను నరికేసిన భార్య.. కారణం ఏంటో తెలుసా?

సెల్వి
శుక్రవారం, 19 సెప్టెంబరు 2025 (10:54 IST)
హైదరాబాద్‌ కోకాపేట్‌లో దారుణం వెలుగు చూసింది. భర్తను ఓ భార్య హతమార్చింది. వివరాల్లోకి వెళితే.. అస్సాంకు చెందిన భార్యాభర్తలు కోకాపేటలో నివాసం ఉంటున్నారు. అయితే  గురువారం రాత్రి దంపతుల మధ్య గొడవ జరిగింది. ఈ గొడవలో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఈ క్రమంలో ఆవేశంతో భార్య కత్తితో భర్తపై దాడి చేసింది. దీంతో భర్త తీవ్రంగా గాయపడ్డాడు. అతని కేకలు విని స్థానికులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. 
 
రక్తపు మడుగులో పడి ఉన్న బాధితుడిని ఆసుపత్రికి తరలించారు. కాగా తీవ్రంగా గాయపడ్డ బాధితుడు అక్కడ చికిత్స పొందుతూ ఆయన మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 
 
వివరాల్లోకి వెళితే.. అస్సాంకు చెందిన భార్యభర్తలు కృష్ణ జ్యోతి బోరా, భరత్ బోరా బతకుతెరువు కోసం అస్సాం నుంచి హైదరాబాద్‌కు వచ్చారు. కొకాపేట్‌లో ఉంటూ స్థానికంగా కార్మికులుగా పని చేస్తూ జీవనం‌ సాగిస్తున్నారు. అయితే కొంతకాలంగా భార్య కృష్ణ జ్యోతిని భర్త కృష్ణ వేధింపులకు గురిచేస్తున్నాడు. 
 
ఇదే క్రమంలో గత అర్ధరాత్రి కూడా చిన్న విషయానికి భార్యాభర్తలు తీవ్రంగా గొడవ పడ్డారు. చివరకు భర్త వేధింపులు తట్టుకోలేక విచక్షణ కోల్పోయిన భార్య.. అతడిపై కూరగాయల కత్తితో దాడి చేసింది. ఈ ఘటనలో భర్త ప్రాణాలు కోల్పోయాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Preity Zinta: ఆభరణాలు జీవితంలో అమూల్యమైన క్షణాలంటున్న ప్రీతి జి జింటా

Tilak Verma : ఆసియా కప్ హీరో క్రికెటర్ తిలక్ వర్మను సత్కరించిన మెగాస్టార్ చిరంజీవి

K-ర్యాంప్ ట్రైలర్ తో డీజే మిక్స్ యూత్ కు రీచ్ చేస్తున్న కిరణ్ అబ్బవరం

Chiru: మన శంకర వర ప్రసాద్ గారు...మీసాల పిల్ల.. 17 మిలియన్‌+ వ్యూస్ సాధించింది

World Health Summit 2025 : తొలి భారతీయ నటిగా కృతి సనన్ గుర్తింపు!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

మామిడి రసం ఇలా తయారు చేస్తున్నారా? చిన్నారులు ఈ జ్యూస్‌లు తాగితే..? (video)

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

ఫ్యాటీ లివర్ సమస్యను అడ్డుకునే చిట్కాలు

ఇంటి లోపల ఆరోగ్యాన్నిచ్చే మొక్కలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments