Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేడు, రేపు తెలంగాణాలో భారీ వర్షాలు...

ఠాగూర్
మంగళవారం, 26 ఆగస్టు 2025 (09:50 IST)
తెలంగాణ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో మంగళ, బుధవారాల్లో భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ ప్రాంతీయ వాతావరణ కేంద్రం తెలిపింది. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం రానున్న 24 గంటల్లో అల్పపీడనంగా మారే అవకాశం ఉందని, ఈ ప్రభావం కారణంగా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని పేర్కొంది. 
 
ముఖ్యంగా, భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్, ములుగు, వరంగల్ జిల్లాల పరిధిలో భారీ వర్షాలు, ఇతర జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన ఈదురు గాలులు గంటకు 30-40 కి.మీ వేగంతో వీచే అవకాశం ఉందని తెలిపింది. మరోవైపు ఐదు రోజులుగా వర్షాలు తగ్గుముఖం పట్టడంతో రాష్ట్రవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు కాస్త పెరిగాయి.
 
అయితే, ఆగస్టు చివరి వారానికి చేరుకుంటున్నా.. తెలంగాణలోని పది జిల్లాల్లో లోటు వర్షపాతం కొనసాగుతోంది. దీంతోపాటు రాష్ట్ర సగటు శాతం కూడా తగ్గుతూ వస్తోంది. ఈ నెలలో కురిసిన అతి భారీ వర్షాలతో 18వ తేదీ నాటికి రాష్ట్ర సగటు.. సాధారణం కన్నా 14 శాతం అధికంగా నమోదైంది. ఆ తర్వాత వర్షాలు తగ్గుముఖం పట్టడంతో సోమవారం నాటికి తొమ్మిది శాతం లోటు నమోదైంది. 
 
నిర్మల్ జిల్లాలో సాధారణం కన్నా 44 శాతం, పెద్దపల్లి (21), జయశంకర్ భూపాలపల్లి (13), నల్గొండ (13), నిజామాబాద్ (12), జగిత్యాల (12), రాజన్న సిరిసిల్ల (11), మంచిర్యాల (10), సంగారెడ్డి (6), మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 4 శాతం లోటు వర్షపాతం నమోదైంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Balakrishna: బాలకృష్ణకు సత్కారం.. సీఎం సహాయ నిధికి రూ.50 లక్షల విరాళం- ప్రముఖుల కితాబు (video)

లోకేష్ కనగరాజ్ హీరోగా రచితా రామ్ నాయిక గా చిత్రం..

పుష్పక విమానం తరహాలో ఉఫ్ఫ్ యే సియాపా రాబోతోంది

OG record: పవన్ కళ్యాణ్ దే కాల్ హిమ్ ఓజీ అమెరికాలో రికార్డ్

ఇద్దరు చదువు రాని వాళ్లు ప్రేమిస్తే ఎలావుంటుందనేదే లిటిల్ హార్ట్స్ మూవీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

మహిళా విభాగానికి ప్రచార ముఖచిత్రంగా కృతి సనన్‌ను నియమించిన క్యాంపస్ యాక్టివ్‌వేర్

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

తర్వాతి కథనం
Show comments