Webdunia - Bharat's app for daily news and videos

Install App

వికటించిన స్మైల్ డిజైనింగ్ ఆపరేషన్... కాబోయే వరుడు మృత్యువాత

వరుణ్
మంగళవారం, 20 ఫిబ్రవరి 2024 (14:33 IST)
హైదరాబాద్ నగరంలో ఓ విషాదకర ఘటన జరిగింది. స్మైల్ డిజైనింగ్ ఆపరేషన్ వికటించింది. అనెస్థీషియా వైద్యుడు అధిక మోతాదులో మత్తు ఇవ్వడంతో ఈ అపరేషన్ వికటించింది. ఫలితంగా కాబోయే వరుడు కుప్పకూలి ప్రాణాలు విడిచాడు. హైదరాబాద్ నగరంలోని జూబ్లీహిల్స్ ప్రాంతంలో తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
హైదరాబాద్ నగరానికి చెందిన లక్ష్మీనారాయణ వింజం (28) అనే యువకుడికి ఇటీవల వివాహం కుదిరింది. ఈ క్రమంలో తన ముఖంపై చిరునవ్వును తీర్చిదిద్దుకోవాలని కాబోయే వరుడు భావించాడు. ఇందుకోసం జూబ్లీ హిల్స్‌లోని ప్రముఖ దంత వైద్యశాలకు చెందిన వైద్యులను సంప్రదించారు. స్మైల్ డిజైనింగ్ ఆపరేషన్ ద్వారా ముఖంపై చిరునవ్వు ఉండేలా తీర్చిదిద్దుతామని వైద్యులు నమ్మించారు. అయితే, ఈ విషయాన్ని లక్ష్మీనారాయణ కుటుంబ సభ్యులకు చెప్పకుండా ఆస్పత్రికి వెళ్లి ఆపరేషన్ చేయించుకున్నాడు. 
 
ఈ ఆపరేషన్ ముగిసిన కొద్దిసేపటికే లక్ష్మీనారాయణ కుప్పకూలిపోయాడు. దీంతో ఆస్పత్రి సిబ్బంది వెంటనే కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి సమాచారం చేరవేశారు. ఆ వెంటనే ఆగమేఘాలపై తల్లిదండ్రులు ఆస్పత్రికి చేరుకోగానే లక్ష్మీనారాయణ అపస్మారక స్థితిలో ఉన్నాడని బాధితుడి తండ్రి రాములు తెలిపారు. 
 
అక్కడ నుంచి హుటాహుటిన దగ్గర్లోన ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే చనిపోయాడని వైద్యులు చెప్పారన్నారు. దీనిపై రాములు వింజం పోలీసులను ఆశ్రయించారు. దంత వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం, అనెస్థీషియా ఓవర్ డోస్ కారణంగానే తమ కొడుకు చనిపోయాడని ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రఘు తాత లో హిందీ కష్టాలు చెప్పిన కీర్తి సురేష్

యండమూరి అంతర్ముఖం వెండి తెరపై కి తేనున్న తుమ్మలపల్లి

స్కూల్ లో నాటకాలు రాయడం, ప్రదర్శించా, అది ఉత్సవం చిత్రానికి యూస్ అయింది : నటుడు దిలీప్ ప్రకాష్

కిరణ్ అబ్బవరం క సినిమా మలయాళం థియేట్రికల్ రైట్స్ తీసుకున్న దుల్కర్ సల్మాన్

నాన్న సూపర్ హీరో చిత్రంలో సుధీర్ బాబు ఫస్ట్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీర కొవ్వు కరిగించేందుకు రాగి దోసె

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే కలిగే ప్రయోజనాలు

స్వచ్ఛంద రక్తదాన శిబిరాల నిర్వాహకులను సత్కరించిన తలసేమియా మరియు సికిల్ సెల్ సొసైటీ

కలబంద రసం ఉదయం పూట సేవిస్తే ఏమవుతుంది?

శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ కరిగిపోయేందుకు చిట్కాలు

తర్వాతి కథనం
Show comments