Webdunia - Bharat's app for daily news and videos

Install App

హైదరాబాదులో చిన్నారి కిడ్నాప్.. ఆడుకుంటుంటే ఆటోలో ఎత్తుకెళ్లాడు...

వరుణ్
ఆదివారం, 4 ఆగస్టు 2024 (08:12 IST)
హైదరాబాద్‌లో చిన్నారి కిడ్నాప్‌కు గురైంది. రోడ్డుపై ఆడుకుంటున్న బాలికను ఓ ఆగంతకుడు ఆటోలో ఎక్కించుకుని తీసుకెళ్లిపోయాడు. దీనికి సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. వివరాల్లోకి వెళితే.. ప్రియాంక అనే మహిళ తన సోదరుడితో కలిసి హైదరాబాద్ బేగంబజార్ ఛత్రి ప్రాంతంలో నివసిస్తోంది. 
 
అయితే శనివారం సాయంత్రం తన సోదరుడు కుమార్తె ప్రగతి( 6)తో కలిసి కట్టెలమండిలోని తన తల్లి వద్దకు వచ్చింది. యాంక సోదరి కుమారుడు హృతిక్‌తో కలిసి బాలిక ఆడుకోవడానికి ఇంటి సమీపంలోని ముత్యాలమ్మ తల్లి ఆలయం వద్దకు వెళ్లింది. కొద్దిసేపటి తర్వాత హృతిక్ ఒక్కడే ఇంటికి వచ్చాడు. 
 
ప్రగతి రాకపోవడంతో చుట్టుపక్కల ప్రాంతాలను బాలిక మేనత్త ప్రియాంక వెతికారు. ఎంతసేపటికీ చిన్నారి ఆచూకీ లభ్యం కాకపోవడంతో అబిడ్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు ఘటన జరిగిన ప్రాంతంలో సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించారు. 
 
సీసీటీవీలో జరిగిందంతా రికార్డ్ అయ్యింది. వెంటనే పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. చిన్నారి ప్రగతిని నిందితుడు ఏం చేస్తాడో అని కుటుంబసభ్యుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. స్థానికంగా కిడ్నాప్ ఘటన కలకలం రేపుతోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దండోరాలో శివాజీ.. 25రోజుల పాటు కంటిన్యూగా షూటింగ్

యాక్షన్ ఎక్కువగా వున్న గుడ్ బ్యాడ్ అగ్లీ అజిత్ కుమార్ కు రాణిస్తుందా !

మెడికల్ యాక్షన్ మిస్టరీ గా అశ్విన్ బాబు హీరోగా వచ్చినవాడు గౌతమ్

ఓపికతో ప్రయత్నాలు చేయండి.. అవకాశాలు వస్తాయి : హీరోయిన్ వైష్ణవి

ది ట్రయల్: షాడో డిఈబిటి — గ్రిప్పింగ్ ప్రీక్వెల్ కాన్సెప్ట్ పోస్టర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌లోని బంజారా హిల్స్‌లో ది బేర్ హౌస్ స్టోర్ ప్రారంభం

చికెన్, మటన్ కంటే ఇందులో ప్రోటీన్లు ఎక్కువ? శాకాహారులకు బెస్ట్ ఫుడ్ ఇదే

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

తర్వాతి కథనం
Show comments