Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆస్తిపన్ను చెల్లించని వారిపై కొరఢా - రూ.200 ఆస్తులను సీజ్ చేసిన జీహెచ్ఎంసీ

ఠాగూర్
శుక్రవారం, 28 ఫిబ్రవరి 2025 (16:34 IST)
గ్రేటర్ హైదరాబాద్ నగర పాలక సంస్థ (జీహెచ్ఎంసీ) ఇంటి యజమానుల పట్ల మరింత కఠినంగా వ్యవహరించనుంది. ఆస్తిపన్ను చెల్లించని ఆస్తులను సీజ్ చేయాలని నిర్ణయించింది. మొండి బకాయిదారులపై కొరఢా ఝుళిపించే చర్యల్లో భాగంగా, ఈ తరహా కఠిన నిర్ణయం తీసుకుంది. ఈ ఆర్థిక సంవత్సరం ముగిసేలోపు అంటే మార్చి 31వ తేదీలోపు పెండింగ్‌లో ఉన్న అన్ని రకాల ఆస్తి పన్నులను చెల్లించాలని లేనిపక్షంలో ఆస్తులను సీజ్ చేస్తామని హెచ్చరించింది. 
 
కాగా, మార్చి 31వ తేదీలోపు రూ.2 వేల కోట్ల ఆస్తి పన్ను చెల్లించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఆ దిశగా చర్యలు చేపడుతోంది. ఇందులోభాగంగా, ఇప్పటివరకు రూ.1500 కోట్లకు పైగా ఆస్తి పన్ను వసూలు చేసినట్టు జీహెచ్ఎంసీ అధికారులు వెల్లడించారు. టార్గెట్ చేరుకోవడానికి రూ.6 లక్షలకు పైగా బకాయిలు ఉన్న వారికి డిస్ట్రెస్ వారెంట్ నోటీసులు జారీ చేస్తున్నారు. అలాగే స్పెషల్ డ్రైవ్‌లు నిర్వహిస్తూ పన్ను వసూళ్లను రాబడుతున్నారు. 
 
నివాస భవనాల పేరుతో అనుమతులు తీసుకుని వాణిజ్య భవనాలుగా మార్చి వ్యాపార భవనాలుగా ఉపయోగిస్తున్న యజమానులపై ప్రత్యేక దృష్టిసారించినట్టు అధికారులు తెలిపారు. పన్ను తప్పించుకునేందుకు ఇలాంటి వ్యవహారాలకు పాల్పడుతున్న వారికి భారీ మొత్తంలో జరిమానా విధిస్తున్నారు. 
 
కాగా, జీహెచ్ఎంసీకి ఆస్తిపన్ను బకాయిపడిన వాటిలో పలు ప్రభుత్వ భవనాలు కూడా ఉన్నాయని అధికారులు తెలిపారు. పన్ను చెల్లించని రూ.200 కోట్ల ఆస్తులను సీజ్ చేసిన బల్దియా... పన్ను ఎగవేతదారులపై కూడా ప్రత్యేక దృష్టిసారించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Hari Hara Veeramallu: ఈసారి డేట్ మారదు, ఇండస్ట్రీ రికార్డులు మారతాయి : దర్శకుడు జ్యోతికృష్ణ

Mahesh Babu: ఏ మాయ చేసావేలో మహేష్ బాబు నటించివుంటే ఎలా వుంటుంది?

Tamannaah: విజయ్‌తో బ్రేకప్ తర్వాత హ్యాపీగా వున్న తమన్నా.. ఫోటోలు వైరల్

Fish Venkat: ఫిష్​ వెంకట్​ మళ్ళీ అనారోగ్యంతో వెంటిలేటర్ పై చికిత్స !

HariHara : పులుల్ని వేటాడే బెబ్బులిగా హరిహరవీరమల్లు ట్రైలర్ ఆకట్టుకుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

మహిళలు బాదం పప్పులు ఎందుకు తినాలో తెలుసా?

ప్రపంచ చర్మ ఆరోగ్య దినోత్సవం: కాలిఫోర్నియా బాదంతో చర్మం చక్కదనం

Monsoon: వర్షాకాలంలో నిద్ర ముంచుకొస్తుందా? ఇవి పాటిస్తే మంచిది..

Breakfast: స్కూల్స్‌కు వెళ్లే పిల్లలు బ్రేక్ ఫాస్ట్ తీసుకోకపోతే.. ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments