Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రయాణికులకు అలెర్ట్ : ఆ నాలుగు రైళ్ళు సికింద్రాబాద్ నుంచి బయలుదేరవు...

ఠాగూర్
బుధవారం, 12 మార్చి 2025 (11:10 IST)
ప్రయాణికులకు రైల్వే శాఖ ఓ హెచ్చరిక చేసింది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి బయలుదేరుతూ వచ్చిన నాలుగు రైళ్లను ఇక నుంచి చర్లపల్లి రైల్వే స్టేషన్ నుంచి బయలుదేరేలా మార్చారు. సికింద్రాబాద్ స్టేషన్‌ను రూ.720 కోట్ల వ్యయంతో ఆధునకీకరణ పనులు చేపడుతున్న నేపథ్యంలో ఈ పనులతో పాటు ప్రయాణికులు ఇబ్బంది లేకుండా ఉండేందుకు వీలుగా ఈ తాత్కాలిక నిర్ణయం తీసుకున్నట్టు రైల్వే శాఖ తెలిపింది. 
 
ఆ ప్రకారంగా ఇక నుంచి తిరుపతి - ఆదిలాబాద్ ప్రాంతాల మధ్య నడిచే కృష్ణా ఎక్స్‌ప్రెస్ ఈ నెల 26వ తేదీ నుంచి చర్లపల్లి స్టేషన్ నుంచి బయలుదేరుతుంది. ఈ రైలు రాత్రి 8.10 గంటలకు చర్లపల్లి టెర్మినల్‌లో బయలుదేరి రాత్రి 9.14 గంటలకు బొల్లారం స్టేషన్‌కు చేరుతుంది. తిరుగు ప్రయాణంలో ఆదిలాబాద్ నుంచి ఈ రైలు ఉదయం 4.29 గంటలకు బొల్లారంకు, ఉదయం 5.45 గంటలకు చర్లపల్లికి చేరుకుంటుంది. 
 
అలాగే, కాకినాడ - లింగంపల్లిల మధ్య నడిచే ప్రత్యేక రైలు ఏప్రిల్ 2వ తేదీ నుంచి జూలై ఒకటో తేదీ వరకు చర్లపల్లి నుంచి బయలుదేరుతుంది. ఉదయం 7.20 గంటలకు చర్లపల్లిలో బయలుదేరి ఉదయం 9.15 గంటలకు గమ్యస్థానమైన లింగంపల్లికి చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఈ రైలు సాయంత్రం 6.30 గంటలకు లింగంపల్లిలో బయలుదేరి రాత్రి 7.30 గంటలకు చర్లపల్లికి చేరుకుంటుంది. 
 
కాజిపేట నుంచి నడిచే హదాప్పర్ ఎక్స్‌ప్రెస్ రైలు రాత్రి 8.20 గంటలకు చర్లపల్లి చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఈ రైలు తెల్లవారుజామున 3 గంటలకు చర్లపల్లికి చేరుకుంటుంది. ఏప్రిల్ 22వ తేదీ నుంచి ఈ నిర్ణయం అమల్లోకి వస్తుంది దక్షిణ మధ్య రైల్వే విడుదల చేసిన ఓ పత్రికా ప్రటనలో పేర్కొంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నాకు శ్రీలీలకు హిట్ కపుల్ లా రాబిన్‌హుడ్ నిలబడుతుంది : నితిన్

Adhi Da Surprise: కేతికా శర్మ హుక్ స్టెప్ వివాదం.. స్కర్ట్‌ను ముందుకు లాగుతూ... ఏంటండి ఇది?

జాట్ ప్రమోషన్లలో జోరుగా పాల్గొన్న సన్నీ డియోల్, రణదీప్ హుడా, వినీత్ కుమార్ సింగ్

గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డులకు దరఖాస్తులు ఆహ్వానం

తెలుగు సినిమాలను, నటులను పరభాషలో లెక్కచేయరంటున్న హీరో

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎర్ర జామకాయ దొరికితే తినేయండి

మహిళలు రోజువారీ ఆహారంలో నువ్వులు చేర్చుకుంటే? ఎలా తీసుకోవాలి?

అల్లంతో 5 అద్భుత ప్రయోజనాలు, ఏంటవి?

వైజాగ్‌ను ప్రకాశవంతంగా మార్చిన బ్లెండర్స్ ప్రైడ్ ఫ్యాషన్ టూర్

కాలిఫోర్నియా బాదంతో ఈ హోలీని ఆరోగ్యకరంగా, ప్రత్యేకంగా చేసుకోండి

తర్వాతి కథనం
Show comments