హైదరాబాద్ - విజయవాడ మధ్య ప్రయాణ టిక్కెట్ ధర రూ.99 మాత్రమే...

ఠాగూర్
శుక్రవారం, 7 ఫిబ్రవరి 2025 (09:41 IST)
హైదరాబాద్ - విజయవాడ ప్రాంతాల మధ్య ప్రయాణించే ప్రయాణికులకు ఇది నిజంగానే శుభవార్త. కేవలం 99 రూపాయలకే తమ గమ్యస్థానాలను చేరుకోవచ్చు. ఈ రెండు నగరాల మధ్య ఈవీ (విద్యుత్ వాహనాలు) బస్సులు అందుబాటులోకి వచ్చాయి. ఈటీవో మోటార్స్‌తో కలిసి ఫ్లిక్స్ బస్ ఇండియా అందుబాటులోకి తీసుకొచ్చిన ఈ బస్సులను గురువారం బేగంపేటలోని ఐటీసీ కాకతీయ హోటల్‌లో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖామంత్రి పొన్నం ప్రభాకర్ లాంఛనంగా ప్రారంభించారు.
 
ఈ సందర్భంగా ఈటీవో మోటార్స్ సీఎంవో రాజీవ్, ఫ్లిక్స్ బస్ ఇండియా ఎండీ సూర్య ఖురానా మాట్లాడుతూ, మూడు నాలుగు వారాల తర్వాత ఈ రెండు ప్రాంతాలమధ్య ఈవీ బస్సులో అందుబాటులోకి వస్తాయి. అనంతరం విజయవాడ - విశాఖపట్టణం మధ్య ఈవీ బస్సు సేవలను అందుబాటులోకి తీసుకొస్తామని పేర్కొన్నారు.
 
సేవలు ప్రారంభమైన తర్వాత నాలుగు వారాల పాటు హైదరాబాద్ - విజయవాడ ప్రాంతాల మధ్య కేవలం రూ.99తో ప్రయాణించవచ్చని తెలిపారు. అన్ని ప్రభుత్వ పథకాలు ఈ బస్సుల్లో వర్తిస్తాయని తెలిపారు. కేవలం ఐదు గంటల్లోనే గమ్యస్థానం చేరుకోవచ్చని వెల్లడించారు. ఈ బస్సుల్లో 49 మంది ప్రయాణించవచ్చని, రానున్న రోజుల్లో స్లీపర్ కోచ్‌ బస్సులను కూడా అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Venky 77: వెంకటేష్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో మల్లీశ్వరీ సీక్వెల్ !

Janhvi : రామ్ చరణ్, జాన్వీ కపూర్ పై పెద్ది కోసం పూణేలో సాంగ్ షూటింగ్

నాలుగు జన్మల కథతో మైథలాజికల్ చిత్రంగా గత వైభవ: ఎస్ఎస్ దుశ్యంత్

బాలీవుడ్ హీరోయిన్ శిల్పాశెట్టికి షాకిచ్చిన బాంబే హైకోర్టు

KRamp: ఫ్లవర్ లాంటి లవర్ ఉంటే లైఫ్ సూపర్ రా అంటూ K-ర్యాంప్ గీతం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దీపావళి డ్రెస్సింగ్, డెకర్: ఫ్యాబ్ఇండియా స్వర్నిమ్ 2025 కలెక్షన్‌

ధ్యానంతో అద్భుతమైన ప్రయోజనాలు

రష్మిక మందన్న, ప్రముఖ క్రియేటర్‌లతో జతకట్టిన క్రాక్స్

గ్యాస్ట్రిక్ సమస్యలు వున్నవారు ఎలాంటి పదార్థాలు తీసుకోకూడదు?

బొబ్బర్లు లేదా అలసందలు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments