లడ్డూ ప్రసాదంలో గుట్కా ప్యాకెట్ ముక్క.. ఏంటిది గోవిందా?!

సెల్వి
సోమవారం, 23 సెప్టెంబరు 2024 (09:49 IST)
Gutkha
ఖమ్మం జిల్లా గొల్లగూడెంకు చెందిన దొంతు పద్మావతి అనే భక్తురాలు తిరుమల నుంచి తాను తీసుకొచ్చిన లడ్డూ ప్రసాదంలో గుట్కా ప్యాకెట్ ముక్క, పొగాకు ఆనవాళ్లు ఉన్నాయని ఆరోపించింది. ఖమ్మం రూరల్ మండలంలోని కార్తికేయ టౌన్‌షిప్‌లో నివాసం ఉండే పద్మావతి మాట్లాడుతూ.. తాను సెప్టెంబర్ 19న శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం తిరుమలకు వచ్చినట్లు తెలిపారు. 
 
ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత, ఆమె తన బంధువులు, ఇరుగుపొరుగు వారికి పంచడానికి లడ్డూను ముక్కలుగా చేసి, ప్రసాదం లోపల గుట్కా పాకెట్ ముక్క, పొగాకు ముక్కలు వున్నట్లు గుర్తించినట్లు ఆరోపించింది. 
 
ఇప్పటికే లడ్డూ ప్రసాదంపై దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతున్న నేపథ్యంలో.. గుట్కా ముక్క లడ్డూ ప్రసాదంలో వుండటం కొత్త వివాదానికి దారి తీస్తుంది. ఇప్పటికే తిరుమల లడ్డూలో పందికొవ్వు, జంతువు కొవ్వు కలిసిన నెయ్యి వినియోగించారని రిపోర్టులలో తేలడంతో భక్తులు ఆందోళన చెందుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mirai collections: ప్రపంచవ్యాప్తంగా 150 కోట్లు దాటిన తేజా సజ్జా మిరాయ్

Sonakshi Sinha : జటాధర లో రక్త పిశాచి, ధన పిశాచి అవతారంలో సోనాక్షి సిన్హా

Ravi Teja: మాస్ జాతర కోసం సబ్ ఇన్ స్పెక్టర్ లక్మణ్ భేరి ఏం చేశాడు...

Anil Ravipudi: ట్రెండ్ కు తగ్గ చిత్రంగా మటన్ సూప్ : అనిల్ రావిపూడి

Tarun Bhaskar: గన్స్, గోల్డ్ చుట్టూ జరిగే కాన్సెప్ట్ తో బా బా బ్లాక్ షీప్ : తరుణ్ భాస్కర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Best Foods: బరువు తగ్గాలనుకునే మహిళలు.. రాత్రిపూట వీటిని తీసుకుంటే?

నాట్స్ మిస్సౌరీ విభాగం ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం

మాతృభూమిపై మమకారాన్ని చాటిన వికసిత భారత్ రన్

ఉపవాసం సులభతరం: మీ వ్రత మెనూలో పెరుగును చేర్చడానికి 5 కారణాలు

ప్రపంచ హృదయ దినోత్సవాన్ని కాలిఫోర్నియా బాదంతో జరుపుకోండి

తర్వాతి కథనం
Show comments