Webdunia - Bharat's app for daily news and videos

Install App

సింగరేణి కార్మికులకు రూ. 1.90లక్షల బోనస్‌.. దసరా కానుక

సెల్వి
శనివారం, 21 సెప్టెంబరు 2024 (10:44 IST)
సింగరేణి కార్మికులకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి శుభవార్త చెప్పారు. సింగరేణి లాభాల్లో కార్మికులకు వాటా ఇస్తామని ప్రకటించారు. తెలంగాణ సాధనలో సింగరేణి కార్మికుల పాత్ర మరువలేనిదని కొనియాడారు. 
 
అలాగే సింగరేణి కార్మికులకు దసరా బోనస్‌ ప్రకటించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. దసరాకు ముందుగానే బోనస్‌ ఇస్తున్నామని చెప్పారు. సింగరేణిలో 33 శాతం లాభాలు పంచుతామన్న ముఖ్యమంత్రి.. ఒక్కొక్కరికి రూ. లక్షా 90 వేలు బోనస్‌ ఇస్తున్నట్టు వెల్లడించారు. 
 
రూ.796 కోట్లు బోనస్‌గా అందిస్తామని వివరించారు. గతేడాది కంటే రూ.20 వేలు అధికంగా ఇస్తామని చెప్పారు. అలాగే సౌర విద్యుత్ ప్లాంట్‌ను 1,000 మెగావాట్లకు విస్తరించడం, రామగుండంలో 500 మెగావాట్ల పంప్డ్ స్టోరేజీ ప్లాంట్ నిర్మాణం చేపట్టనున్నట్లు ప్రకటించారు. సింగరేణి ఉత్పత్తిని పెంచుతూ ఇతర రాష్ట్రాలకు కూడా బొగ్గు ఎగుమతి చేస్తున్నామని తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఇంటికి తాళం వేసి... అజ్ఞాతంలోకి నటి కస్తూరి - మొబైల్ స్విచాఫ్!!

సరైన భాగస్వామిగా సరైన వ్యక్తిని ఎంచుకోకపోతే జీవితం నరకమే : వరుణ్ తేజ్

కోలీవుడ్‌లో విషాదం - ఢిల్లీ గణేశ్ ఇకలేరు...

సోనీ LIV ఫ్రీడమ్ ఎట్ మిడ్‌నైట్‌ ట్రైలర్‌ను ఆవిష్కరణ, నవంబర్ 15న ప్రసారం

హైదరాబాద్‌లో కట్టుదిట్టమైన భద్రత నడుమ సికిందర్ షూటింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హార్ట్ ఎటాక్ రాకుండా వుండాలంటే ఏం చేయాలి?

క్యాన్సర్‌పై విజయం సాధించడానికి గ్లోబల్ నిపుణులతో భాగస్వామ్యం- విజ్ఞాన మార్పిడి: అపోలో క్యాన్సర్ కాంక్లేవ్

ఉసిరికాయ పొడితో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

రాగులుతో చేసిన పదార్థాలు ఎందుకు తినాలి?

బీట్ రూట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments