Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఓ యువతి ప్రాణాలు తీసిన ఇద్దరు వ్యక్తుల గొడవ...

ఠాగూర్
శుక్రవారం, 5 జనవరి 2024 (11:43 IST)
తెలంగాణ రాష్ట్రంలోని మెదక్ జిల్లాలో ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన గొడవ ఓ యువతి ప్రాణాలు తీసింది. దీంతో పెళ్లింటి విషాదం నెలకొంది. ఈ ఘటన మెదక్ జిల్లాలోని చేగుంట మండలం, రెడ్డిపల్లి కాలనీలో జరిగింది. ఈ వివరాలను పరిశీలిస్తే, రెడ్డిపల్లి వడ్డెర కాలనీకి చెందిన ఉప్పు వెంకటి అనే వ్యక్తి కుమార్తె సువర్ణ వివాహం గురువారం జరిగింది. పెళ్లి కుమార్తెను ఊరేగింపుగా తీసుకెళ్లి కామారెడ్డి జిల్లా బికనూు మండలం లక్ష్మీదేవిపల్లిలోని మెట్టినింటికి పంపించారు. అయితే, తిరిగి ఇంటికి వస్తుండగా అదే కాలనీకి చెందిన ఉప్పు నరేందర్, స్వామి మధ్య గొడవ జరిగింది. 
 
ఈ ఘర్షణలో స్వామిని నరేందర్ నెట్టేశాడు. దీంతో కిందపడిన స్వామిని అక్కడున్న వారు పక్కకు తీసుకెళ్లారు. దీంతో ఆగ్రహానికి గురైన నరేందర్ తన థార్ కారును తీసుకొచ్చి అక్కడ ఉన్న పెళ్లి బందంపై ఎక్కించారు. ఈ ఘటనలో రమ్య (23) అనే యువతి తీవ్రంగా గాయపడటంతో, ఆమెను హైదరాబాద్ తరలిస్తుండగా ప్రాణాలు కోల్పోయింది. ఇక ఉప్పు దుర్గయ్య, సుజాత, యాదగిరి, సురేష్‌లు తీవ్రంగా గాయపడ్డారు. స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. పరారీలో ఉన్న నరేందర్ కోసం గాలిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మళ్ళీ సినిమాల్లో నటించనున్న కేంద్ర మంత్రి!!

హోం టౌన్ సిరీస్ చూస్తే మీ సొంతూరు గుర్తుకువస్తుంది - రాజీవ్ కనకాల

విడుదలకు సిద్ధమవుతున్న సుమయ రెడ్డి నటించిన డియర్ ఉమ చిత్రం

హన్సికపై గృహహింస కేసు ... కొట్టివేయాలంటూ హైకోర్టులో పిటిషన్

అఖండ 2 తాండవంలో శివతత్త్వం చెబుతున్న బోయపాటి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

వేసవిలో లోదుస్తులు బిగుతుగా ధరించారంటే? రాత్రిపూట వేసుకోవద్దు..

తర్వాతి కథనం
Show comments