Webdunia - Bharat's app for daily news and videos

Install App

9 నుంచి శ్రీశైలం - విజయవాడల మధ్య సీ ప్లేన్ ప్రయోగం

ఠాగూర్
మంగళవారం, 5 నవంబరు 2024 (11:02 IST)
Sea Plane
ఈ నెల 9వ తేదీ నుంచి శ్రీశైలం - విజయవాడ ప్రాంతాల మధ్య సీ ప్లేన్ ప్రయోగానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుడుతుంది. మొత్తం 14 సీట్లున్న ఈ సీ ప్లేన్‌ను డీ హవిల్లాండ్ ఎయిర్ క్రాఫ్ట్‌ సంస్థ తయారు చేసింది. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ సీ ప్లేన్‌ను పున్నమి ఘాట్‌లో దీనిని ప్రారంభిస్తారు.

తొలి సీ ప్లేన్‌ను విజయవాడ - శ్రీశైలం మధ్య నడపాలని యోచిస్తున్నారు. ఈ ప్రయోగం విజయవంతమైతే రెగ్యులర్ సర్వీసులు అందుబాటులోకి రానున్నాయి. సీ ప్లేన్ ప్రయోగం నేపథ్యంలో కృష్ణానదిలోని పున్నమిఘాట్ వద్ద ఏర్పాటు చేసిన ఫ్లోటింగ్ జెట్టీకి అధికారులు మెరుగులు దిద్దుతున్నారు. పున్నమిఘాట్ వద్ద బయలుదేరే విమానం శ్రీశైలంలోని పాతాళగంగ బోటింగ్ పాయింట్ వద్ద ల్యాండ్ అవుతుంది. 
 
విజయవాడలోని దుర్గామల్లేశ్వరస్వామి ఆలయం, శ్రీశైల మల్లన్న ఆలయ సందర్శనకు వెళ్లే భక్తులకు సౌకర్యంగా ఉండేలా దీనిని రూపొందిస్తున్నారు. రెండో దశలో విశాఖ, నాగార్జున సాగర్, గోదావరి తదితర ప్రాంతాల్లోనూ సీ ప్లేన్లను నడపాలని ప్రభుత్వం యోచిస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సంతాన ప్రాప్తిరస్తు నుంచి విక్రాంత్, చాందినీ చౌదరి ల రొమాంటిక్ సాంగ్

ప్రదీప్ రంగనాథన్, మమిత బైజు జంటగా బైలింగ్వల్ చిత్రం

Nitin: సోలోడేట్ లోనే రాబిన్‌హుడ్ అనుకున్నాం, కానీ పోటీ తప్పదనే రావాల్సివచ్చింది : చిత్ర టీమ్

Warner: క్రికెట్‌లో స్లెడ్జింగ్‌ కంటే ఆ కామెంట్స్ పెద్దవేమీ కాదు.. లైట్‌గా తీసుకున్న వార్నర్.. వెంకీ

'కన్నప్ప'కు పోటీగా 'భైరవం' - వెండితరపైనే చూసుకుందామంటున్న మనోజ్!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Coconut Oil: మహిళలూ రాత్రిపూట కొబ్బరినూనెను ముఖానికి రాసుకుంటే?

3,500 Steps: మహిళలు ఆరోగ్యంగా వుండాలంటే.. రోజుకు...

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

హెచ్ అండ్ ఎం నుంచి మహిళల కోసం సరికొత్త ఫ్యాషన్ దుస్తులు

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

తర్వాతి కథనం
Show comments