Webdunia - Bharat's app for daily news and videos

Install App

హైదరాబాద్ రెస్టారెంట్‌‌లో బంగారు పూత పూసిన అంబానీ ఐస్ క్రీమ్ (video)

సెల్వి
గురువారం, 10 ఏప్రియల్ 2025 (15:37 IST)
Ambani ice cream
హుబర్ అండ్ హోలీ అనే హైదరాబాదు రెస్టారెంట్లో బంగారు పూత పూసిన ఐస్ క్రీం వడ్డిస్తున్నట్లు చూపించే వీడియో సోషల్ మీడియాలో సంచలనం సృష్టించింది. ఆ వంటకం ధర రూ.1,200. నెటిజన్లు దీనిని "అంబానీ ఐస్ క్రీం" అని పిలిచారు. ఈ వీడియోను ఆన్‌లైన్‌లో షేర్ చేస్తూ, ఇన్‌స్టాగ్రామ్‌కు చెందిన ఫుడ్ వ్లాగర్ ఇది భారతదేశంలో "అత్యంత ఖరీదైన ఐస్ క్రీం" అని రాశాడు. 
 
ఈ ఐస్ క్రీమును ఒక సిబ్బంది తన చేతుల్లో ఐస్ క్రీం కోన్ పట్టుకుని, దానిలో చాక్లెట్ ముక్కలు, లిక్విడ్ చాక్లెట్, బాదం పప్పులు, చాక్లెట్ ఐస్ క్రీం స్కూప్స్ నింపుతుండగా వీడియో ప్రారంభమైంది. ఆ తర్వాత అతను దానిపై మందపాటి క్రీమ్ పొరను పూసి, డెజర్ట్‌కు అద్భుతమైన రూపాన్ని ఇచ్చాడు. 
 
క్రీమీ లేయర్ సెట్ చేసిన తర్వాత, సిబ్బంది ఐస్ క్రీంను బంగారు రేకుతో అలంకరించారు. ఈ డెజర్ట్‌ను సాధారణ ప్లేట్‌లో కాకుండా బంగారు రంగు ట్రేలో వడ్డించారు. దీంతో ఆ ఐస్‌క్రీముకు రాయల్ లుక్ వచ్చేసింది. మార్చి 6న అప్‌లోడ్ చేయబడిన ఈ పోస్ట్ 10 మిలియన్ల వీక్షణలు, మూడు లక్షల లైక్‌లు, వందలాది కామెంట్లు నమోదైనాయి.
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Daakshi | Food & Lifestyle (@foodiedaakshi)

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అభిమానులకు సర్‌ప్రైజ్‌లు ఇవ్వనున్న 'హరిహర వీరమల్లు'

Naga Chaitanya : ప్రియదర్శి, ఆనంది ల ప్రేమంటే లవ్లీ ఫస్ట్ లుక్

Kiran Abbavaram: K-ర్యాంప్ నుంచి గ్లింప్స్ రిలీజ్, రిలీజ్ డేట్ ప్రకటన

రొటీన్ కు భిన్నంగా పోలీస్ వారి హెచ్చరిక వుంటుంది : దర్శకుడు బాబ్జీ

Mr. Reddy : నా జీవితంలో జరిగిన కథే మిస్టర్ రెడ్డి : టీఎన్ఆర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు తాగేందుకు అనువైన టీ, ఏంటది?

తర్వాతి కథనం
Show comments