Webdunia - Bharat's app for daily news and videos

Install App

యూరిన్ బాటిళ్లతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలందరం సిద్ధం వున్నాము: ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి

ఐవీఆర్
బుధవారం, 30 అక్టోబరు 2024 (12:31 IST)
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలందరం యూరిన్ శాంపిల్ డబ్బాలతో సిద్ధంగా వున్నామని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బావమరిది రాజ్ పాకాల ఫామ్‌‍హౌస్‌లో జరిగిన రేవ్ పార్టీలో భారీ ఎత్తున విదేశీ మద్యాన్ని కూడా స్వాధీనం చేసుకున్నట్లు వార్తలు వచ్చాయి. పైగా ఈ పార్టీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల్లో కొందరు డ్రగ్స్ తీసుకున్నారంటూ కాంగ్రెస్ పార్టీ విమర్శించడంతో కౌశిక్ రెడ్డి ఈ మేరకు సవాల్ విసిరారు.
 
కాగా 26వ తేదీ అర్థరాత్రి ఈ ఫాంహౌస్‌లో పోలీసులు దాదాపు 21 గంటలు సోదాలు జరిపారు. శనివారం అర్థరాత్రి 11.30 గంటల నుంచి ఆదివారం రాత్రి వరకు సోదాలు కొనసాగించారు. అలాగే, ఈ పార్టీలో పాల్గొన్నవారిని అదుపులోకి తీసుకుని డ్రగ్స్ పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల్లో రాజ్ పాకాల స్నేహితుడు మద్దూరి విజయ్‌కు పాజటివ్‌గా తేలింది. అతను కొకైన్ తీసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. రాజ్ పాకాల ఇచ్చినందునే తాను డ్రగ్స్ తీసుకున్నానని అతను పోలీసులకు వాంగ్మూలం ఇచ్చాడు. రాజ్ పాకాలతో తనకు ఐదేళ్లుగా పరిచయం ఉందని, ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీకి సీఈవోగా ఉన్నానని విజయ్ పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో వెల్లడించాడు. దీంతో రాజ్ పాకాల, విజయ్‌లపై మోకిల పోలీసులు కేసు నమోదు చేశారు.
 
దీనిపై ఎన్డీపీఎస్ యాక్ట్స్ పాటు గేమింగ్ చట్టం కింద కేసులు నమోదు చేసినట్టు రాజేంద్ర నగర్ డీసీపీ శ్రీనివాస్ వెల్లడించారు. ఈ పార్టీకి 21 మంది పురుషురు, 14 మంది మహిళలు హాజరైనట్టు తెలిపారు. ఇదిలావుంటే, ఈ పార్టీ వ్యవహారంలో రాజ్ పాకాలకు బీఎన్ఎస్ఎస్ 35(3) సెక్షన్ ప్రకారం నోటీసులు జారీచేసినట్టు మోకిల పోలీసులు వెల్లడించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బంగారం స్మగ్లింగ్ కేసు : రన్యారావుకు బెయిల్ అయినా జైల్లోనే...

నేను, నా భర్త విడిపోవడానికి మూడో వ్యక్తే కారణం : ఆర్తి రవి

మంచు మనోజ్ బర్త్ డే సందర్భంగా ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్‌ రక్షక్ అనౌన్స్ మెంట్

ముంబయి గుహల్లో హీరో తేజ సజ్జా మూవీ మిరాయ్ కొత్త షెడ్యూల్‌

కరణ్ అన్షుమాన్ క్రియేట్ చేసిన రానా నాయుడు 2 వచ్చేస్తుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

Black Salt: మజ్జిగలో ఈ ఒక్కటి కలుపుకుని తాగితే ఎన్ని ప్రయోజనాలో?

గ్రీన్ టీ తాగుతున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

తర్వాతి కథనం
Show comments