Webdunia - Bharat's app for daily news and videos

Install App

బిల్డింగ్ పైనుంచి దూకి సాఫ్ట్వేర్ ఉద్యోగి ఆత్మహత్య

ఐవీఆర్
శుక్రవారం, 25 అక్టోబరు 2024 (11:32 IST)
హైదరాబాద్ లోని కోకాపేటలో విషాదకర సంఘటన చోటుచేసుకున్నది. అప్పుల బాధతో ఓ సాఫ్ట్వేర్ ఇంజినీర్ భవనం పైనుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా వున్నాయి. ఆంధ్ర ప్రదేశ్ లోని తణుకుకి చెందిన 27 ఏళ్ల నాగ ప్రభాకర్ గచ్చిబౌలిలోని హాస్టల్ లో వుంటూ ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. ఐతే కొంతకాలంగా అతడు అప్పుల్లో ఇరుక్కున్నాడు.
 
ఆ అప్పులను తీర్చలేక మధనపడుతూ వుండేవాడు. ఈ క్రమంలో కోకాపేటలోని విరూపాక్ష మెన్స్ హాస్టలుకి వచ్చాడు. అక్కడ 7వ అంతస్తు నుంచి కిందికి దూకేసి ప్రాణాలు తీసుకున్నాడు. ఐతే గచ్చిబౌలి హాస్టల్లో వుండే నాగ ప్రభాకర్ ఇక్కడికి ఎందుకు వచ్చాడన్నది ప్రశ్నగా మారింది. కాగా ప్రభాకర్ మృతిపై సికింద్రాబాదులో వుంటున్న అతడి సోదరి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'కొత్త ఆరంభం' అంటున్న గాయకుడు రాహుల్ సిప్లిగంజ్

ఏంటయ్యా ఇది.. హీరోలైనా వరకట్నం కోసం వేధిస్తారా? హీరో ధర్మ మహేష్‌పై కేసులు

Court : రహస్యంగా కోర్టు దర్శకుడి వివాహం.. వధువు ఎవరంటే?

ప్రభాస్‌తో స్నేహం వుంది: శ్రీ దేవి విజయ్ కుమార్

CM: ఎ.రేవంత్ రెడ్డి ని కలిసిన జాతీయ ఫిల్మ్ అవార్డ్సు గ్ర‌హీత‌లు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments