బస్సు చక్రాల రూపంలో యముడు.. 11 ఏళ్ల బాలుడు మృతి.. ఎక్కడ? (video)

సెల్వి
మంగళవారం, 24 సెప్టెంబరు 2024 (12:34 IST)
సోషల్ మీడియాలో ఒళ్లు గగుర్పాటుకు గురిచేసే వీడియోలు ఎన్నో వైరల్ అవుతూనే వున్నాయి. తాజాగా బస్సు చక్రాల కింద పడి ఓ విద్యార్థి ప్రాణాలు కోల్పోయిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. హైదరాబాద్ బోరబండ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ప్రమాదంలో శివచరణ్ (11) అనే విద్యార్థి మృతి చెందాడు. 
 
స్కూల్ నుంచి సైకిల్ పై ఇంటికి వెళ్తుండగా.. కార్మిక నగర్ నుంచి వస్తున్న శ్రీసాయి చైతన్య స్కూల్ బస్సు శివ చరణ్‌పై దూసుకెళ్లింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన శివ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. 
 
వివరాల్లోకి వెళితే.. ఓం నగర్‌లో నివసించే చిరంజీవి అనే శివ చరణ్  (11) అనే కుర్రాడు స్థానికంగా ఉండే సెయింట్ సలోమోన్స్ పాఠశాలలో ఐదవ తరగతి చదువుతున్నాడు. 
 
స్కూలు ముగియగానే సైకిల్‌పై ఇంటికి వెళ్తుండగా.. ఎస్పీఆర్ హిల్స్ నుండి రోడ్డుపైకి చరణ్‌ వస్తుండగా.. కార్మిక నగర్ వస్తున్న శ్రీ సాయి చైతన్య  పాఠశాల బస్సు రోడ్డు పైకి వచ్చింది. అనుకోకుండా ఆ బస్సు రోడ్డుపైకి రావడంతో శివ అదుపుతప్పి బస్సు కింద పడిపోయాడు. 
 
బస్సు చక్రాలు అతని మీద నుంచి వెళ్లిపోయాయి. ఈ ఘటనలో గాయపడిన విద్యార్థిని ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బాలీవుడ్ దిగ్గజ నటుడు ధర్మేంద్ర డియోల్ ఇకలేరు

వంద కోట్ల మార్కులో వరుసగా మూడు చిత్రాలు.. హీరో ప్రదీప్ రంగనాథన్ అదుర్స్

ధనుష్, మృణాల్ ఠాకూర్ డేటింగ్ పుకార్లు.. కారణం ఏంటంటే?

Chiru: నయనతార గైర్హాజరు - అనిల్ రావిపూడికి వాచ్ ని బహూకరించిన చిరంజీవి

యోగి ఆదిత్యనాథ్‌ కు అఖండ త్రిశూల్‌ ని బహూకరించిన నందమూరి బాలకృష్ణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments