నక్రేకల్ నుండి నాగార్జున సాగర్ వరకు 4-లేన్ బైపాస్..

సెల్వి
మంగళవారం, 15 అక్టోబరు 2024 (10:20 IST)
ఎన్‌హెచ్ 565లోని నక్రేకల్ నుండి నాగార్జున సాగర్ సెక్షన్ వరకు తెలంగాణలోని నల్గొండ టౌన్ కోసం 14 కి.మీ పొడవు, 4-లేన్ బైపాస్ నిర్మాణానికి 516 కోట్లు మంజూరు చేస్తున్నట్లు కేంద్ర రోడ్డు రవాణా రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ప్రకటించారు.
 
గడ్కరీ ఎక్స్‌లో "తెలంగాణకు తాము రూ.516కోట్లు మంజూరు చేశామన్నారు. ఎన్‌హెచ్ 565లోని  నక్రేకల్ నుండి నాగార్జున సాగర్ వరకు నల్గొండ టౌన్ కోసం 14 కి.మీ పొడవు, 4-లేన్ బైపాస్ నిర్మాణానికి 516 కోట్లు.
 
ఎన్‌హెచ్ 565 తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లను కలిపే కీలకమైన జాతీయ రహదారి, ఇది తెలంగాణలోని నక్రేకల్ వద్ద ఎన్‌హెచ్ 65తో జంక్షన్ నుండి ప్రారంభమై నల్గొండ, మాచర్ల, ఎర్రగొండపాలెం, కనిగిరి వంటి పట్టణాల గుండా వెళుతుంది. 
 
నల్గొండ టౌన్ ట్రాఫిక్ ఇబ్బందులతో సతమతమవుతుంది. దీంతో రద్దీ ప్రయాణీకుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని పొడవైన రోడ్డు మార్గం కోసం నిధులు కేటాయించినట్లు గడ్కరీ వెల్లడించారు. ఈ ప్రాజెక్ట్ నల్గొండలో ట్రాఫిక్‌ను తగ్గించడమే కాకుండా నక్రేకల్, నాగార్జున సాగర్ మధ్య కనెక్టివిటీని మెరుగుపరిచేందుకు రహదారి భద్రతను కూడా పెంచుతుందని నితిన్ గడ్కరీ తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మతం పేరుతో ఇతరులను చంపడం - హింసించడాన్ని వ్యతిరేకిస్తా : ఏఆర్ రెహ్మాన్

సినీ నటి హేమకు కర్నాటక కోర్టులో ఊరట.. డ్రగ్స్ కేసు కొట్టివేత

Harish Kalyan: హ‌రీష్ క‌ళ్యాణ్ హీరోగా దాషమకాన్ టైటిల్ ప్రోమో

Ramana Gogula: ఆస్ట్రేలియా టూ అమెరికా..రమణ గోగుల మ్యూజిక్ జాతర

చిరంజీవిని శ్రీనివాస కళ్యాణ మహోత్సవానికి ఆహ్వానించిన వంశీ కృష్ణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments