Webdunia - Bharat's app for daily news and videos

Install App

హైదరాబాద్‌‌లో కేరళ భవన్... స్థలం, నిధులు కేటాయించిన కేసీఆర్..!

Webdunia
సోమవారం, 2 ఫిబ్రవరి 2015 (11:12 IST)
తెలంగాణలో కేరళీయుల సంక్షేమం కోసం ముఖ్య మంత్రి కేసీఆర్ నడుంకట్టారు. హైదరాబాద్‌లో మలయాళీ అసోసియేషన్ భవనం (కేరళ భవన్)ను నిర్మించేందుకు మహేంద్ర హిల్స్‌లో ఎకరం భూమి కేటాయించి, దాని నిర్మాణానికి కోటి రూపాయల నిధులను కేసీఆర్ ప్రకటించారు. అదేవిధంగా నగరంలో నివసిస్తున్న నిరుపేద మలయాళీయుల కుటుంబాలకు పక్కా ఇళ్లు కట్టిస్తానని కేసీఆర్ హామీ ఇచ్చారు.
 
కేరళ ప్రభుత్వ సహకారంతో నగరంలోని మలయాళీ అసోసియేషన్(సీటీఆర్‌ఎంఏ) ఆధ్వర్యంలో ఆదివారం బాలానగర్‌లోని నవీన సాంస్కృతిక కళా కేంద్రంలో కేరళీయం-2015 పేరుతో వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ ఉత్సవాలలో పాల్గొన్న కేసీఆర్ మాట్లాడుతూ.. హైదరాబాద్‌లో సుమారు నాలుగు లక్షల మందికి పైగా మలయాళీలు ఉన్నారని తెలిపారు. వారికి తమ ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పారు. ఈ  కార్యక్రమంలో కేరళ మంత్రి కె.సి.జోసఫ్, ఎంపీలు బూర నర్సయ్యగౌడ్, బాల్క సుమన్‌లతో పాటు పలువురు మలయాళీయులు కూడా పాల్గొన్నారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మళ్ళీ సినిమాల్లో నటించనున్న కేంద్ర మంత్రి!!

హోం టౌన్ సిరీస్ చూస్తే మీ సొంతూరు గుర్తుకువస్తుంది - రాజీవ్ కనకాల

విడుదలకు సిద్ధమవుతున్న సుమయ రెడ్డి నటించిన డియర్ ఉమ చిత్రం

హన్సికపై గృహహింస కేసు ... కొట్టివేయాలంటూ హైకోర్టులో పిటిషన్

అఖండ 2 తాండవంలో శివతత్త్వం చెబుతున్న బోయపాటి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

వేసవిలో లోదుస్తులు బిగుతుగా ధరించారంటే? రాత్రిపూట వేసుకోవద్దు..

Show comments