కేటీఆర్‌కు కేంద్ర ఎన్నికల సంఘం నోటీసులు.. ఎందుకంటే?

Webdunia
ఆదివారం, 26 నవంబరు 2023 (14:58 IST)
మంత్రి కేటీఆర్‌కు కేంద్ర ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది. టీ-వర్క్స్‌లో నిరుద్యోగులతో కేటీఆర్ ముఖాముఖిపై ఫిర్యాదులు అందడంతో చర్యలు తీసుకున్నారు. దీనిపై ఈసీ కేటీఆర్‌ను వివరణ కోరింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు మంత్రి కేటీఆర్‌కు ఎన్నికల సంఘం షాక్ ఇచ్చింది. 
 
మంత్రి కేటీఆర్‌ ప్రభుత్వ కార్యాలయమైన టీ-వర్క్స్‌ను ఎన్నికల ప్రచారానికి వినియోగిస్తున్నారని, ప్రభుత్వ కార్యాలయమైన టీ-వర్క్స్‌లో నిరుద్యోగులను కేటీఆర్ ఎలా ఇంటర్వ్యూ చేస్తున్నారని ఇటీవల కాంగ్రెస్ ఎంపీ రణదీప్ సూర్జీవాలా ఈసీకి ఫిర్యాదు చేశారు. మంత్రి కేటీఆర్ ఎన్నికల కోడ్ ఉల్లంఘించారని రణదీప్ ఈసీకి ఫిర్యాదు చేశారు. ఆయన ఫిర్యాదును స్వీకరించిన ఈసీ.. మంత్రి కేటీఆర్‌కు నోటీసులు జారీ చేసింది. 
 
టీ-వర్క్స్‌లో జరిగిన ఇంటర్వ్యూలో కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలని ఎన్నికల సంఘం కేటీఆర్‌ను కోరింది. అయితే ఎన్నికల ఫలితాలు వెలువడిన మరుసటి రోజే అశోక్ నగర్ వెళ్లి యూనివర్సిటీ విద్యార్థులు, నిరుద్యోగులతో సమావేశమవుతానని మంత్రి కేటీఆర్ ఇటీవల యువతకు హామీ ఇచ్చారు.
 
ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో కొన్ని పొరపాట్లు జరిగిన మాట వాస్తవమే. అధికారంలోకి రాగానే టీఎస్పీఎస్సీని ప్రక్షాళన చేస్తానని కేటీఆర్ వెల్లడించారు. అనంతరం ఎన్నికలు, ఓట్లు, పార్టీల గురించి మంత్రి కేటీఆర్‌ మాట్లాడారు.
 
 
 
ఎన్నికల కోడ్‌ అమలులో ఉన్న తరుణంలో కేటీఆర్‌ రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయమైన టీ-వర్క్స్‌ కేంద్రాన్ని రాజకీయ కార్యక్రమాలకు ఎలా ఉపయోగించుకుంటారని ప్రతిపక్షాలు సైతం కేటీఆర్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. అన్ని విషయాలను పరిశీలించిన ఈసీ మంత్రి కేటీఆర్‌కు నోటీసులు జారీ చేసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మరో 100 జన్మలైనా.. రజనీకాంత్‌లాగే పుట్టాలనుకుంటున్నా... తలైవర్ భావోద్వేగం

Akhil Raj: అఖిల్ రాజ్ హీరోగా సతీష్ గోగాడ దర్శకత్వంలో అర్జునుడి గీతోపదేశం

Raashi Singh: త్రీ రోజెస్ సీజన్ 2 నుంచి లైఫ్ ఈజ్ ఎ గేమ్.. లిరికల్ సాంగ్

Suresh Babu: ఎమోసనల్‌ డ్రామా పతంగ్‌ చిత్రం : సురేష్‌బాబు

Anita Chowdhury: అంబాసిడర్ కారులో పదిమంది కుక్కేవారు : అనితా చౌదరి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జుట్టుకు మేలు చేసే ఉల్లిపాయ నూనె.. మసాజ్ చేస్తే అవన్నీ పరార్

శీతాకాలంలో లవంగం దగ్గర పెట్టుకోండి, బాగా పనికొస్తుంది

winter tips, వెల్లుల్లిని ఇలా చేసి తింటే?

కాలిఫోర్నియా బాదంతో రెండు సూపర్‌ఫుడ్ రెసిపీలతో శీతాకాలపు ఆరోగ్యం ప్రారంభం

సీతాఫలం పండును ఎవరు తినకూడదు... తింటే విషం తీసుకున్నట్టే?

తర్వాతి కథనం
Show comments