Webdunia - Bharat's app for daily news and videos

Install App

రేవంత్‌‌ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన డీజీపీ - సస్పెండ్ చేసిన ఈసీ

Webdunia
ఆదివారం, 3 డిశెంబరు 2023 (19:16 IST)
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయభేరీ మోగించింది. అయితే, కౌంటింగ్ ప్రారంభం నుంచి కాంగ్రెస్ హవా కొనసాగుతుంది. దీంతో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని డీజీపీ అంజనీ కుమార్ యాదవ్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఓట్ల లెక్కింపు కొనసాగుతుండగానే రేవంత్‌ రెడ్డిని అంజనీకుమార్ యాదవ్ కలవడాన్ని ఎన్నికల సంఘం తీవ్రంగా పరిగణించింది. దీంతో డీజీపీ చర్యను నిబంధనల ఉల్లంఘన కింద ఈసీ భావించి, సస్పెండ్ చేసింది. ఈ ఉదయం కౌంటింగ్ ప్రారంభమైన కొన్ని గంటలకే కాంగ్రెస్ హవా స్పష్టమైంది. ఈ క్రమంలో డీజీపీ అంజనీ కుమార్ యాదవ్ తన అనుచరులతో రేవంత్ రెడ్డి నివాసానికి వెళ్లి పుష్పగుచ్ఛం అభినందనలు తెలిపారు. 
 
ఛత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్ పార్టీకి ఊహించని షాక్... 
 
అసెంబ్లీ ఎన్నికల జరిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో ఊహించని షాక్ తగిలింది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలను తలకిందులు చేస్తూ భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చింది. ఆ పార్టీకి స్పష్టమైన ఆధిక్యత వచ్చింది. ప్రస్తుతం మ్యాజిక్ ఫిగర్‌ను బీజేపీ కైవసం చేసుకుంది. 
 
రాష్ట్రంలోని అసెంబ్లీ స్థానాల సంఖ్యలు 90 కాగా ప్రస్తుతం బీజేపీ అభ్యర్థులు 57 స్థానాల్లో ముందంజలో ఉన్నారు. కాంగ్రెస్ 33 స్థానాల్లో లీడ్‌లో కొనసాగుతున్నారు. కిందటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 71 స్థానాలను గెలుచుకోగా.. బీజేపీ కేవలం 14 సీట్లతో సరిపెట్టుకుంది. ఈ దఫా తొలి రౌండ్‌లో కాంగ్రెస్ ఆధిక్యం చూపినప్పటికీ తర్వాత వెనకబడింది. .
 
మరోవైపు, మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో కూడా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చింది. మొత్తం 230 సీట్లున్న మధ్యప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీకి 165 సీట్లు, కాంగ్రెస్ పార్టీకి 64 సీట్లు, ఇతరులు ఒక స్థానంలో నిలిచారు. అలాగే, రాజస్థాన్ రాష్ట్రంలో 199 సీట్లకు గాను బీజేపీ 115 సీట్లు, కాంగ్రెస్ 69, ఐఎన్డీ 7, ఇతరులు 5 చోట్ల ఆధిక్యంలో ఉన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఏపీ సీఎం చంద్రబాబుకు బహుమతి ఇచ్చిన పూనమ్ కౌర్

Rajamouli: ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా యమదొంగ రీ రిలీజ్

జలియాన్‌వాలా బాగ్ హత్యాకాండ కేసరి ఛాప్టర్ 2 తెలుగు లో రాబోతోంది

Kamlhasan: సిద్ధాంత పోరాటంగా థగ్ లైఫ్ యాక్షన్-ప్యాక్డ్ ట్రైలర్ రిలీజ్

చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్ కోసం కూడా కథలు సిద్ధం చేశాం : డైరెక్టర్ విజయ్ కనకమేడల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

Black Salt: మజ్జిగలో ఈ ఒక్కటి కలుపుకుని తాగితే ఎన్ని ప్రయోజనాలో?

గ్రీన్ టీ తాగుతున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

తాటి బెల్లం ఆరోగ్య ప్రయోజనాలు

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments