తెలంగాణలో కాంగ్రెస్ తొలి విజయం.. రెండో రౌండ్‌లోనూ గెలుపే

Webdunia
ఆదివారం, 3 డిశెంబరు 2023 (12:42 IST)
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ బోణీ కొట్టింది. ఆ పార్టీ తరఫున అశ్వారావుపేటలో పోటీ చేసిన ఆదినారాయణ ఘన విజయం సాధించారు. 28,358 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. రాష్ట్రంలోని మరో 63 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ముందంజలో కొనసాగుతున్నారు. అధికార బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు 40 చోట్ల లీడ్‌లో వున్నారు. 
 
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్‌లో రెండో ఫలితం వచ్చేసింది. ఇది కూడా కాంగ్రెస్ ఖాతాలోనే పడింది. ఇల్లందు నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బరిలో నిలిచిన కోరం కనకయ్య భారీ మెజారిటీతో గెలుపొందారు. బీఆర్ఎస్ అభ్యర్థి హరిప్రియపై ఏకంగా 38 వేల పైచిలుకు ఓట్ల మెజారిటీ సాధించారు. దీంతో కాంగ్రెస్ పార్టీ ఖాతాలో రెండో విజయం నమోదైంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sandhigdham: సందిగ్ధం అందరినీ ఆకట్టుకునేలా ఉంటుంది : పార్ధసారథి

అవి నా ఫోటోలు కాదు.. ఏఐ సృష్టించిన చిత్రాలు.. రుక్మిణి వసంత్

Lenin Teaser: అఖిల్, భాగ్యశ్రీల మధ్య కెమిస్ట్రీ చాలా ఫ్రెష్‌గా లెనిన్ టీజర్ వచ్చేసింది

Chiru 158 Update: నివేథా పేతురాజ్ మాస్టర్ కు పాఠాలు చెబుతుందా?

Ramcharan: నా కూతురిని ఎత్తుకున్నా నొప్పి పెడుతుంది : రామ్ చరణ్

తర్వాతి కథనం
Show comments