Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేటీఆర్ కాన్ఫిడెంట్ : 80 సీట్లు ఖాయం...

Webdunia
శుక్రవారం, 7 డిశెంబరు 2018 (17:22 IST)
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ శుక్రవారం సాయంత్రం 5 గంటలతో ముగిసింది. ఈ ఎన్నికల్లో రికార్డు స్థాయిలో పోలింగ్ నమోదైంది. అయితే, తెరాస నేత, తాజా మాజీ మంత్రి కేటీఆర్ మాత్రం విజయంపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. 
 
ఆయన తన సొంత నియోజకవర్గంలో ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎన్నికల పోలింగ్ ముగిసిన తర్వాత కేటీఆర్ స్పందిస్తూ, రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్ సరళి బాగుందన్నారు. ఎన్నికల్లో తమ పార్టీకే సానుకూల ఫలితాలు రాబోతున్నాయన్నారు. 
 
మూడింట రెండు వంతుల మెజారిటీతో తెరాస విజయఢంకా మోగించబోతోందన్నారు. అంటే ఖచ్చితంగా 80 సీట్లలో విజయకేతనం ఎగురవేస్తారని తెలిపారు. సో.. తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీపై మళ్లీ గులాబీ జెండా ఎగురుతుందని మంత్రి కేటీఆర్ విశ్వాసం వ్యక్తంచేశారు. 

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

తర్వాతి కథనం
Show comments