Webdunia - Bharat's app for daily news and videos

Install App

ద్యావుడా.. కాంగ్రెస్ - టిడిపి పొత్తు.. కెసిఆర్ వ్యూహమేనట...ఎట్టెట్టా?

Webdunia
శనివారం, 8 డిశెంబరు 2018 (18:47 IST)
తెలంగాణ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారన్న ఆసక్తి ఇప్పుడు సర్వత్రా నిండిపోయింది. ఇప్పటికే పలు సర్వేలు వచ్చినా… ఏవీ విశ్వసించదగ్గవిగా అనిపించడంలేదు. కన్ఫ్యూజన్‌గా వున్నాయి. పోలింగ్‌ మునిసిన తరువాత వెలువడే ఎగ్జిట్‌ పోల్‌ సర్వేల వల్ల కాస్త స్పష్టత వచ్చే అవకాశాలున్నా ఈసారి అవి కూడా గందరగోళాన్నే సృష్టిస్తున్నాయి. ఎవరికి తోచిన నెంబర్లు వాళ్లు విసిరేసినట్లు అనిపిస్తోంది. అసలు నెంబరు తెలియాలంటే మాత్రం డిసెంబర్‌ 11న కౌంటింగ్‌ తరువాత వెలువడే ఫలితాల వరకూ ఆగాల్సిందే.
 
అన్నింటికంటే…. బద్ధశత్రువులైన కాంగ్రెస్‌-టిడిపి పొత్తు ఎటువంటి ఫలితాలను ఇస్తుందనే దానిపై అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఈ పొత్తు ఫలించి, టిఆర్‌ఎస్‌ ఘోర ఓటమి చవిచూడబోతోందని కొందరు చెబుతుంటే…. ఈ ‘వికృత’ పొత్తు వికటిస్తుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
 
ఈ అంచనాల సంగతి అలా వుంచితే… కాంగ్రెస్‌-టిఆర్‌ఎస్‌ పొత్తు వెనుక కెసిఆర్‌ వ్యూహం ఉందన్న నమ్మలేని చర్చ కూడా ఒకటి సాగుతోంది. వాస్తవంగా తెలుగుదేశం పార్టీ టిఆర్‌ఎస్‌తో పొత్తు కోసం ప్రయత్నించింది. కెసిఆర్‌ అంగీకరించకపోవడంతో చంద్రబాబు కాంగ్రెస్‌తో పొత్తు కుదుర్చుకున్నారు. ఇది బయటకు కనిపిస్తున్నది. అయితే… కెసిఆర్‌ చెప్పడంతోనే చంద్రబాబు కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకున్నారని కొందరు విశ్లేషిస్తున్నారు.
 
తెలంగాణలో రెడ్డి సామాజికవర్గం కాంగ్రెస్‌తో ఉంది. టిఆర్‌ఎస్‌కు దగ్గర కావడం లేదు. కాంగ్రెస్‌-టిడిపి పొత్తు పెట్టుకుంటే…. చంద్రబాబుపై ఉన్న కోపంతో రెడ్డి సామాజికవర్గం టిఆర్‌ఎస్‌ వైపు వస్తుందన్న నమ్మకంతో కెసిఆర్‌ ఈ వ్యూహం అమలు చేసినట్లు చెబుతున్నారు.
 
కెసిఆర్‌ వ్యూహం వల్ల కాంగ్రెస-టిడిపి పొత్తు కుదిరిందా లేక ఆ పార్టీలే తమ ప్రయోజనాల కోసం పొత్తు పెట్టుకున్నాయా అనే సంగతి పక్కనపెడితే…. ఈ పొత్తు కచ్చితంగా టిఆర్‌ఎస్‌కు మేలు చేసిందన్న అంచనాలు వస్తున్నాయి. ఎప్పటి నుంచో కాంగ్రెస్‌తో అనుబంధంలో ఉన్న రెడ్డి సామాజికవర్గం ఆ పార్టీని విడిచిపెట్టేశాయి. తెలంగాణలో వైసిపి కూడా పోటీలో లేకపోవడంతో… అనివార్యమై టిఆర్‌ఎస్‌ వైపు అడుగులు వేసింది.
 
ఈ పొత్తు వల్ల తెలుగుదేశం ఓట్లు కొన్ని వచ్చి కాంగ్రెస్‌ పార్టీకి కొంత లాభపడితే పడవచ్చుగానీ…. కాంగ్రెస్‌ శాశ్వతంగా రెడ్డి సామాజికవర్గాన్ని కోల్పోయిందని తెలంగాణ రాజకీయాలను పరిశీలిస్తున్నవారు చెబుతున్నారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ గెలిస్తే ఫర్వాలేదు…. ఆ వర్గం కాంగ్రెస్‌తోనే వుందని చెప్పుకోవచ్చు. అదే కాంగ్రెస్‌ ఓడిపోయిందే అనుకోండి … రెడ్డి సామాజిక వర్గం శాశ్వతంగా కాంగ్రెస్‌ను విడిచిపెట్టి వేరే దారి చూసుకున్నదని అనేస్తారు. ఒక విధంగా కాంగ్రెస్‌ భారీ మూల్యాన్నే చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. మరి ఏం జరుగుతుందో చూద్దాం కానీయండి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కర్మ ఏం చెబుతుందంటే... నయనతార ఆసక్తికర ట్వీట్

"వికటకవి"కి వ‌ర్క్ చేయ‌టం డిఫ‌రెంట్ ఎక్స్‌పీరియెన్స్‌: జోశ్యుల‌ గాయ‌త్రి దేవి

నందమూరి మోక్షజ్ఞ చరిష్మాటిక్ న్యూ స్టిల్‌ రిలీజ్

సోనూసూద్‌కు సంకల్ప్ కిరణ్ పురస్కారంతో సత్కారం

ఏఆర్ రెహ్మాన్-సైరా విడాకులు రద్దు అవుతాయా? సైరా లాయర్ ఏమన్నారు?

తర్వాతి కథనం
Show comments