Webdunia - Bharat's app for daily news and videos

Install App

భద్రాద్రి నుంచే తొలి ఫలితం వెల్లడి.. ఎందుకంటే...

Webdunia
సోమవారం, 10 డిశెంబరు 2018 (15:31 IST)
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు మంగళవారం ఉదయం 8 గంటల నుంచి చేపట్టనున్నారు. ఈ ఎన్నికల ఫలితాల కోసం ప్రతి ఒక్కరూ సర్వత్రా ఉత్కంఠతతో ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో తొలి ఫలితం ఎక్కడ నుంచి వెలువడుతుంది? ఏ కేంద్రం నుంచి వెలువడుతుంది? అన్నదానిపై కూడా ఆసక్తి నెలకొనివుంది. 
 
ఈ నేపథ్యంలో తెలంగాణ ఓట్ల లెక్కింపును పరిశీలిస్తే, భద్రాచలం అసెంబ్లీ నియోజకవర్గంలో మొత్తం 161 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. ఒక్కో రౌండ్‌ ఓట్ల లెక్కింపు 14 టేబుళ్లపై జరుగనుంది. దీంతో ఉదయం 11.30 గంటల లోపే భద్రాచలం నుంచి తొలి ఫలితం వెలువడే అవకాశం ఉంది. 
 
అలాగే, చాలా ఆలస్యంగా శేరిలింగంపల్లి అసెంబ్లీ స్థానం నుంచి వెలువడనుంది. ఇక్కడ గరిష్టంగా 580 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటుచేశారు. దీంతో ఈ నియోజకవర్గ ఫలితం మిగతా వాటితో పోల్చితే ఆలస్యంగా వెలవడనుంది. 

సంబంధిత వార్తలు

ఎం.ఎల్.ఎ.లను కిడ్నాప్ చేసిన రామ్ చరణ్ - తాజా అప్ డేట్

దేవర లో 19 న ఎర్రసముద్రం ఎగిసెగిసిపడుద్ది : రామ జోగయ్యశాస్త్రి

సుచి లీక్స్ గోల.. ధనుష్, త్రిషనే కాదు.. మాజీ భర్తను కూడా వదిలిపెట్టలేదు..

పుష్ప2 నుంచి దాక్షాయణి గా అనసూయ తిరిగి రానుంది

థియేటర్ల మూత అనంతరం డైరెక్టర్స్ అసోసియేషన్ ఈవెంట్

తర్వాతి కథనం
Show comments