Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణ ఎన్నికల పోలింగ్ : ఉదయం 11 గంటల వరకు 23 శాతం పోలింగ్

Webdunia
శుక్రవారం, 7 డిశెంబరు 2018 (12:49 IST)
తెలంగాణ రాష్ట్ర శాసనసభ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా సాగుతోంది. అయితే కొన్ని చోట్ల కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ, తెరాస వర్సెస్ కాంగ్రెస్ శ్రేణుల మధ్య ఘర్షణలు జరుగుతున్నాయి. 
 
అయితే, ఉదయం 11 గంటల వరకు రాష్ట్రవ్యాప్తంగా 23 శాతం పోలింగ్ నమోదైనట్టు సమచారాం. మరోవైపు గతంలో ఎన్నడూ లేనివిధంగా పోలింగ్ ప్రక్రియ సాగుతోంది. అదేసమయంలో యువత కూడా తమ ఓటుహక్కును పూర్తిస్థాయిలో వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాలకు బారులుతీరుతున్నారు. 
 
ముఖ్యంగా, ఆదిలాబాద్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, జనగామ జిల్లాల్లో పది శాతం, వరంగల్ జిల్లాలో 22 శాతం, జగిత్యాలలో 18 శాతం, కరీంనగర్ జిల్లాలో 15 శాతం, మెదక్ జిల్లాలో 14 శాతం, పాలమూరు జిల్లాలో 12 శాతం, కామారెడ్డిలో 27 శాతం చొప్పున పోలింగ్ నమోదైంది. 
 
మరోవైపు, పోలింగ్ సాయంత్రం 5 గంటలకు సాగనుంది. సమస్యాత్మక కేంద్రాల్లో మాత్రం 4 గంటల వరకు జరుగుతుంది. నిర్దేశించిన సమయం దాటిన తర్వాత పోలింగ్ బూత్‌కు చేరుకునే ఓటర్లకు ఓటు హక్కు వినియోగించుకోవడానికి అనుమతించరని ఎన్నికల ప్రధాన అధికారి రజత్ కుమార్ వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

డాకు మహారాజ్ యాభై రోజుల్లో మీముందుకు రాబోతుంది

పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు డేట్ ఫిక్స్ చేశారు

గగన మార్గన్‌ లో ప్రతినాయకుడిగా విజయ్ ఆంటోని మేనల్లుడు అజయ్ ధిషన్‌

ఆయన వల్లే బాలక్రిష్ణ సినిమాలో శ్రద్దా శ్రీనాథ్ కు ఛాన్స్ వచ్చిందా?

నా అంచనా నిజమైంది, సినిమాటికా ఎక్స్‌పో మూడో ఎడిషన్ పై పి.జి. విందా

తర్వాతి కథనం
Show comments