Webdunia - Bharat's app for daily news and videos

Install App

వార్మప్ మ్యాచ్‌లో టీం ఇండియా పరాజయం

Webdunia
ఐసీసీ ట్వంటీ- 20 ప్రపంచకప్ సన్నాహాల్లో భాగంగా సోమవారం జరిగిన వార్మప్ మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ టీం ఇండియా‌కు ఎదురుదెబ్బ తగిలింది. లార్డ్స్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన ప్రాక్టీసు ట్వంటీ- 20 మ్యాచ్‌లో టీం ఇండియా తొమ్మిది పరుగుల తేడాతో పరాజయం పాలైంది. ట్వంటీ- 20లో భారత్‌పై పరాజయమెరుగని కివీస్ మరోసారి తన సత్తా చాటింది.

171 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన టీం ఇండియా నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 161 పరుగులే చేసింది. రోహిత్ శర్మ (36), రైనా (45), జడేజా (41 నాటౌట్) జట్టును విజయతీరాలకు చేర్చేందుకు విఫలయత్నం చేశారు. కెప్టెన్ ధోనీ (6), ఓపెనర్ గంభీర్ (14), యూసుఫ్ పఠాన్ (2) రాణించలేకపోవడంతో భారత్ లక్ష్యఛేదనలో వెనుకబడింది.

ఏడో ఓవర్‌లో కివీస్ కెప్టెన్ వెటోరి.. రోహిత్, ధోనీ వెంటవెంటనే అవుటవడంతో మ్యాచ్ మలుపు తిరిగింది. ఇదిలా ఉంటే మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల పతనానికి 170 పరుగులు చేసింది. రాస్ టేలర్ (41), బ్రెండన్ మెక్‌కలమ్ (31), స్టైరిస్ (29), ఫ్రాంక్లిన్ (27) రాణించడంతో ప్రత్యర్థి ముందు కివీస్ బలమైన లక్ష్యాన్ని ఉంచింది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

అమెరికాలో నారా లోకేష్.. తెలంగాణ నెటిజన్ల బాధేంటంటే?

ఏపీలో రూ.1,40,000 కోట్లు పెట్టుబడి.. అనకాపల్లిలో స్టీల్ ప్లాంట్

సొంత రాష్ట్రం.. ఆర్మీ జవాన్లతో ప్రధాని మోదీ దీపావళి సెలెబ్రేషన్స్ (video)

కేరళలో వందే భారత్ సరికొత్త ట్రాక్‌ల కోసం ఏర్పాట్లు

ఆ మీడియా సంస్థలను నడిరోడ్డు మీద నిలబెడతా: పోలీసు వాహనం నుంచి బోరుగడ్డ వార్నింగ్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

క విజయానికి పేరెంట్స్ కంటే నేనే ఎక్కువ సంతోషిస్తున్నా : కిరణ్ అబ్బవరం

క సినిమాతో కిరణ్ అబ్బవరం ఇక కదం తొక్కుతాడా? క రివ్యూ

సీతమ్మకు భక్తురాలిగా మారాలనుకుంటున్నాను.. సాయిపల్లవి

పుష్ప రాజ్, శ్రీవల్లి దీపావళి శుభాకాంక్షలతో పుష్ప2 అప్ డేట్

దీపావళి సందర్భంగా గేమ్ ఛేంజర్ టీజర్ అప్ డేట్

Show comments