Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహిళా ప్రపంచకప్ పోటీల్లో భారత్ ఓటమి

Webdunia
గురువారం జరిగిన ఐసీసీ ట్వంటీ-20 మహిళా ప్రపంచకప్ సెమీస్‌లో భారత మహిళా క్రికెట్ జట్టు ఘోర పరాజయం పాలైంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్లుకోల్పోయి 145 పరుగులు చేసింది.

న్యూజిలాండ్ టీం కెప్టెన్ వాక్టిన్ అజేయంగా 89 పరుగులు చేసి జట్టు స్కోరుకు పునాదిగా నిలిచింది. దీంతో 146 పరుగుల లక్ష్యాన్ని భారత జట్టు ముందుంచింది.

146 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత మహిళా క్రికెటర్లు ఏ దశలోనూ పోటీ ఇవ్వలేకపోయారు. నిర్ణీత ఓవర్లలో తొమ్మిది వికెట్లు కోల్పోయి కేవలం 93 పరుగులు మాత్రమే చేశారు.

ఇదిలావుండగా న్యూజిలాండ్ బౌలర్లు రుక్, శేట్రిత్ వే లు చెరో రెండు వికెట్లు తీసుకుని తమ టీంకు గెలుపును అందించారు. కాగా భారత మహిళా క్రికెటర్లలో మిథాలీ రాజ్ 20 పరుగులు, అమితా శర్మ 24 పరుగులు, అంజూమ్ చోప్రా 15 పరుగులు చేశారు. మిగిలినవారు ఏమంతగా రాణించలేకపోవడంతో భారత్ 53 పరుగుల తేడాతో ఓడిపోయింది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

బోయ్ ఫ్రెండ్ కౌగిలించుకోలేదని 14 అంతస్తుల కాలేజీ భవనం పైనుంచి దూకేసిన యువతి

అమరావతికి శుభవార్త చెప్పిన ప్రపంచ బ్యాంక్ - తొలి విడతగా రూ.3535 కోట్లు రిలీజ్

జాతీయ ఉపాధి హామీ పథకం లబ్దిదారుల జాబితాలో షమీ సోదరి పేరు!!

పని పురుగులా మారిపోయా, నా ముక్కు నుంచి రక్తం పడింది: బెంగళూరు CEO

సీఎం మమతకు షాకిచ్చిన సుప్రీంకోర్టు - 25 వేల టీచర్ నియామకాలు రద్దు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హోం టౌన్ సిరీస్ చూస్తే మీ సొంతూరు గుర్తుకువస్తుంది - రాజీవ్ కనకాల

విడుదలకు సిద్ధమవుతున్న సుమయ రెడ్డి నటించిన డియర్ ఉమ చిత్రం

హన్సికపై గృహహింస కేసు ... కొట్టివేయాలంటూ హైకోర్టులో పిటిషన్

అఖండ 2 తాండవంలో శివతత్త్వం చెబుతున్న బోయపాటి

టిల్లు సిరీస్‌లా జాక్ సిరీస్‌కు ప్లాన్ చేసిన దర్శకుడు భాస్కర్

Show comments