Webdunia - Bharat's app for daily news and videos

Install App

నెదర్లాండ్స్- ఇంగ్లాండ్ మ్యాచ్ హైలెట్స్

Webdunia
ఐసీసీ ట్వంటీ- 20 ప్రపంచకప్ ప్రారంభ మ్యాచ్‌లో అతిథ్య ఇంగ్లాండ్‌పై నెదర్లాండ్స్ జట్టు నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించింది. చారిత్రాత్మక లార్డ్స్ మైదానంలో జరిగిన ఈ మ్యాచ్ హైలెట్స్‌ను పరిశీలిస్తే...

-> ఐసీసీ ట్వంటీ ప్రపంచకప్‌లో ఇంగ్లాండ్‌కు ఇది వరుసగా ఐదో పరాజయం. గత ప్రపంచకప్‌లో బంగ్లాదేశ్, ఇంగ్లాండ్ పేరిట ఉన్న వరుసగా నాలుగు ట్వంటీ- 20 మ్యాచ్‌‍లలో పరాజయం పాలైన రికార్డును ఇంగ్లాండ్ తాజా మ్యాచ్‌లో సవరించింది.

-> ఇంగ్లాండ్ సెప్టెంబరు 13, 2007న జింబాబ్వేపై 50 పరుగుల తేడాతో విజయం సాధించి, తరువాత వరుసగా ఐదు ప్రపంచకప్ మ్యాచ్‌లలో ఇంగ్లాండ్ పరాజయాలు మూటగట్టుకుంది.

-> రవి బొపారా (34 బంతుల్లో 46 పరుగులు) అంతర్జాతీయ ట్వంటీ- 20 క్రికెట్‌లో అత్యుత్తమ స్కోరు నమోదు చేసుకున్నాడు.

-> ల్యూక్ రైట్ (49 బంతుల్లో 71 పరుగులు) ట్వంటీ- 20 క్రికెట్‌లో అత్యుత్తమ స్కోరు నమోదు చేశాడు. ఇది అతని తొలి అర్ధ సెంచరీ కూడా. బొపారా- రైట్ జోడించిన 102 పరుగులే ట్వంటీ- 20 క్రికెట్‌లో అత్యుత్తమ తొలి వికెట్ భాగస్వామ్యం.

-> ఇంగ్లాండ్ బౌలర్ జేమ్స్ ఆండర్సన్ (3/23) కూడా తన ట్వంటీ- 20 కెరీర్‌లో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చాడు. అతని గత అత్యుత్తమ ప్రదర్శన న్యూజిలాండ్‌పై 2/24.

-> నెదర్లాండ్స్ జట్టు (163 పరుగులు)కు ట్వంటీ- 20 క్రికెట్‌లో అది అతిపెద్ద స్కోరు. ఆగస్టు 2, 2008లో బెల్‌ఫాస్ట్‌లో జరిగిన ట్వంటీ మ్యాచ్‌లో సాధించిన 153/5 స్కోరే ఇప్పటివరకు ఆ జట్టు అత్యుత్తమ స్కోరు.

-> నెదర్లాండ్స్ బ్యాట్స్‌మెన్ టామ్ డి గ్రూత్ (30 బంతుల్లో 49 పరుగులు) ఈ మ్యాచ్ ద్వారా కెరీర్‌లో అత్యుత్తమ స్కోరు నమోదు చేసుకున్నాడు. అంతేకాకుండా తొలి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌ను కూడా దక్కించుకున్నాడు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

అమెరికాలో నారా లోకేష్.. తెలంగాణ నెటిజన్ల బాధేంటంటే?

ఏపీలో రూ.1,40,000 కోట్లు పెట్టుబడి.. అనకాపల్లిలో స్టీల్ ప్లాంట్

సొంత రాష్ట్రం.. ఆర్మీ జవాన్లతో ప్రధాని మోదీ దీపావళి సెలెబ్రేషన్స్ (video)

కేరళలో వందే భారత్ సరికొత్త ట్రాక్‌ల కోసం ఏర్పాట్లు

ఆ మీడియా సంస్థలను నడిరోడ్డు మీద నిలబెడతా: పోలీసు వాహనం నుంచి బోరుగడ్డ వార్నింగ్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

క విజయానికి పేరెంట్స్ కంటే నేనే ఎక్కువ సంతోషిస్తున్నా : కిరణ్ అబ్బవరం

క సినిమాతో కిరణ్ అబ్బవరం ఇక కదం తొక్కుతాడా? క రివ్యూ

సీతమ్మకు భక్తురాలిగా మారాలనుకుంటున్నాను.. సాయిపల్లవి

పుష్ప రాజ్, శ్రీవల్లి దీపావళి శుభాకాంక్షలతో పుష్ప2 అప్ డేట్

దీపావళి సందర్భంగా గేమ్ ఛేంజర్ టీజర్ అప్ డేట్

Show comments