Webdunia - Bharat's app for daily news and videos

Install App

దక్షిణాఫ్రికా చేతిలో వెస్టిండీస్ పరాజయం

Webdunia
ట్వంటీ-20 ప్రపంచకప్ టోర్నీ లాస్ట్-8లో భాగంగా దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో వెస్టిండీస్ పరాజయాన్ని చవిచూసింది. బ్యాటింగ్‌లో గిబ్స్ భీభత్సం.. వెన్ పార్నెల్, కలిస్ అద్భుత రౌండ్‌ నైపుణ్యంతో దక్షిణాఫ్రికా చేతిలో వెస్టిండీస్ 20 పరుగులు తేడాతో ఓటమి పాలైంది.

తొలుత టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న వెస్టిండీస్‌పై ఆరంభం నుండి దక్షిణాఫ్రికా ఎదురుదాడికి దిగింది. దక్షిణాఫ్రికా ఓపెనర్లు కెప్టెన్ గ్రేమ్ స్మిత్, కలిస్ అద్భుతమైన ఆరంభాన్నిచ్చారు. వీరిద్దరూ కలిసి కేవలం 5.5 ఓవర్లలో 54 పరుగులు చేసి వెస్టిండీస్ బౌలర్లపై ఒత్తిడి పెంచారు.

పరుగులు చేసే క్రమంలో స్మిత్ పెవిలియన్ చేరగా.. గిబ్స్ వచ్చీరావడంతోనే వెస్టిండీస్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. అప్పటికే క్రీజులో నిలదొక్కుకున్న కలిస్ సహకారంతో గిబ్స్ కేవలం 35 బంతుల్లో 8 ఫోర్లు ఒక సిక్సర్‌తో 55 పరుగులు చేశాడు. ఈలోగా కలిస్ కూడా 31 బంతుల్లో 6 ఫోర్లు, ఒక సిక్స్ 45 పరుగులు చేశాడు.

దీంతో దక్షిణాఫ్రికా నిర్ణీత ఓవర్లు ముగిసే సమయానికి ఏడు వికెట్లు కోల్పోయి 183 పరుగులు చేయగలిగింది. 184 పరుగులు విజయలక్ష్యంతో బరిలోకి దిగిన వెస్టిండీస్ లెండిల్ సిమ్మన్స్ అద్భుత బ్యాటింగ్‌తో చేసిన ఒంటరి పోరు మినహాయిస్తే మిగిలిన జట్టంతా పేలవ ప్రదర్శనను కనబరిచింది.

ఒకరకంగా చెప్పాలంటే.. భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో సమిష్టిగా రాణించిన వెస్టిండీస్.. ఈ మ్యాచ్‌లో మాత్రం పూర్తి విఫలమైంది. దీంతో నిర్ణీత ఓవర్లు ముగిసే సమాయనికి 9 వికెట్లు కోల్పోయి 163 పరుగులు మాత్రమే చేయగలిగింది. కాగా, 13 పరుగులకే 4 వికెట్లు పడగొట్టిన దక్షిణాఫ్రికా బౌలర్ పార్నెల్‌కు మ్యాన్ ఆఫ్ మ్యాచ్ అవార్డు దక్కింది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

అమెరికాలో నారా లోకేష్.. తెలంగాణ నెటిజన్ల బాధేంటంటే?

ఏపీలో రూ.1,40,000 కోట్లు పెట్టుబడి.. అనకాపల్లిలో స్టీల్ ప్లాంట్

సొంత రాష్ట్రం.. ఆర్మీ జవాన్లతో ప్రధాని మోదీ దీపావళి సెలెబ్రేషన్స్ (video)

కేరళలో వందే భారత్ సరికొత్త ట్రాక్‌ల కోసం ఏర్పాట్లు

ఆ మీడియా సంస్థలను నడిరోడ్డు మీద నిలబెడతా: పోలీసు వాహనం నుంచి బోరుగడ్డ వార్నింగ్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

క విజయానికి పేరెంట్స్ కంటే నేనే ఎక్కువ సంతోషిస్తున్నా : కిరణ్ అబ్బవరం

క సినిమాతో కిరణ్ అబ్బవరం ఇక కదం తొక్కుతాడా? క రివ్యూ

సీతమ్మకు భక్తురాలిగా మారాలనుకుంటున్నాను.. సాయిపల్లవి

పుష్ప రాజ్, శ్రీవల్లి దీపావళి శుభాకాంక్షలతో పుష్ప2 అప్ డేట్

దీపావళి సందర్భంగా గేమ్ ఛేంజర్ టీజర్ అప్ డేట్

Show comments