Webdunia - Bharat's app for daily news and videos

Install App

చెలరేగిన భారత్: ఐర్లాండ్ చిత్తు... చిత్తు

Webdunia
ప్రపంచ కప్ ట్వంటీ-20లో భారత్ తన ఆఖరి లీగ్‌ మ్యాచ్‌లో క్రికెట్ పసికూన ఐర్లాండ్‌ను చిత్తు చేసింది. ఐర్లాండ్ విధించిన 113 పరుగుల విజయలక్ష్యాన్ని ఆడుతూ పాడుతూ చేధించిన భారత్ ఈ టోర్నీలో విజయదరహాసంతో సూపర్-8కు చేరుకుంది.

నాటింగ్‌హామ్ వేదికగా జరిగిన ఈ ఆఖరి లీగ్ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్ నిర్ణీత 18 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 112 పరుగులు మాత్రమే చేయగలిగింది. జహీర్‌ఖాన్ 4 వికెట్లు, ఓజా రెండు వికెట్లు తీసుకుని ఐర్లాండ్ బ్యాట్స్‌మెన్‌ను నిలువరించడంతో వారు భారీస్కోరు సాధించడం కష్టమైంది.

ఐర్లాండ్ జట్టులో మూని (19), వైట్ (29)లు కాస్త ప్రతిఘటించి జట్టు పరువు నిలిపారు. అనంతరం 113 పరుగుల విజయలక్ష్యంతో బరిలో దిగిన భారత్ 15.3 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 113 పరుగులు సాధించి విజయాన్ని అందుకుంది. ఓపెనర్లు రోహిత్‌శర్మ (52 నాటౌట్), గంభీర్ (37)లు చెలరేగడంతో భారత్ విజయం నల్లేరుమీద నడకలా సాగింది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

PV Sindhu: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పీవీ సింధు, వెంకట సాయి.. (video)

Telangana: భర్తను చెల్లెలి సాయంతో హత్య చేసిన భార్య.. ఎందుకు ?

జనవరి 31 నుంచి అరకు ఉత్సవాలు.. మూడు రోజుల జరుగుతాయ్

తెలంగాణ భక్తులకు తిరుమలలో ప్రాధాన్యత ఇవ్వాలి: కొండా సురేఖ

కుమార్తె వచ్చాకే డాక్టర్ మన్మోహన్ అంత్యక్రియలు...

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వెంకటేష్, మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ లపై పొంగల్ సాంగ్

అజిత్ కుమార్, త్రిష మూవీ విడాముయర్చి నుంచి లిరిక‌ల్ సాంగ్

డ్రీమ్ క్యాచర్ ట్రైలర్ చూశాక నన్ను అడివిశేష్, రానా తో పోలుస్తున్నారు : ప్రశాంత్ కృష్ణ

క్రిస్మస్ సెలవులను ఆస్వాదిస్తున్న సమంత.. వినాయక పూజ..?

3 సినిమాతో తన కెరీర్ ముదనష్టం అయ్యిందంటున్న శ్రుతి హాసన్

Show comments