Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్వైన్‌ ఫ్లూ : వ్యాధి నివారణకు చిట్కాలు

Gulzar Ghouse
మంగళవారం, 19 జనవరి 2010 (15:53 IST)
FILE
స్వైన్ ఫ్లూ వ్యాధికి కారణాలు : స్వైన్ ఫ్లూ వ్యాధి ప్రధానంగా హెచ్-1 ఎన్-1 వైరస్ ఒక వ్యక్తి నుంచి మరో వ్యక్తికి శ్వాసక్రియ ద్వారా, దగ్గు, తుమ్ములు, చేతులు కలపడంతోనే వ్యాపిస్తుంది. ఈ వ్యాధి వ్యాపిస్తే చాలా రోజుల వరకు తలనొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, కండరాల నొప్పులు, అలసట తదితర లక్షణాలుంటాయి.

జాగ్రత్తలు : ప్రాతఃకాలం త్వరగా నిద్రనుంచి లేసి తులసి, వేప (5-10) ఆకులు తీసుకుని బాగా నమిలి తినాలి. తర్వాత 2-3 గ్లాసుల గోరువెచ్చని నీటిని సేవించండి. మీకు వీలైనంత మేరకు దాదాపు 30 నిమిషాల పాటు యోగాసనాలు వేయండి.

ఎండలో నిలబడండి : ఉదయం నీరెండలో (తేలికపాటి వస్త్రాలు ధరించి) 5-10 నిమిషాలపాటు కూర్చోండి. లేదా శరీరానికి నూనెతో మాలిష్ చేసి ఎండలో కూర్చుంటే శరీరానికి కావలసిన ' విటమిన్ డి ' అందుతుంది. దీంతో శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది.

ఏమేమి తినాలంటే : పుల్లటి పండ్లు...ఉదాహరణకు ఉసిరికాయ, ఆరంజి పండు, నిమ్మపండు, ఆకుకూరలు, కొత్తిమిరి, సలాడ్, మొలకెత్తిన గింజలు ఆహారంగా తీసుకుంటుండాలి.

* మీరు తీసుకునే భోజనంలో ఆకలి ఉన్నాకూడా కాస్త తక్కువగానే భుజించాలంటున్నారు వైద్యులు.

* ఉప్పు, చక్కెర, నెయ్యి, నూనె పదార్థాలను తక్కువగా వాడండి.

* పత్యం : మైదాతో తయారు చేసిన ఆహార పదార్థాలు, పాచిపోయిన ఆహారం, వేపుళ్ళు, తీపి పదార్థాలు, ఫాస్ట్ ఫుడ్, జంక్ ఫుడ్, చల్లటి పానీయాలు, పొగాకు, మద్యపానం సేవించకూడదు.

2024 టీడీపి నో మోర్, జనసేన పరార్, రోజా ఇలా అనేశారేంది రాజా? (video)

మాజీ సీఎం జగన్ తాడేపల్లి ఇంటి ముందు రోడ్డు ద్వారా Live View (video) చూసేద్దాం రండి

వామ్మో ఎండలు... అధిక ఉష్ణోగ్రత దెబ్బకు ఆగిపోయిన విమానం!!

జగన్‌పై క్రిమినల్ చర్యలు తీసుకోవాలి : బ్రాహ్మణ వేదిక నేత ఫిర్యాదు

జగన్ అభిమాన పోలీసులకు హోం మంత్రి అనిత స్ట్రాంగ్ వార్నింగ్!!

కల్కి 2898 AD నుంచి ప్రభాస్, దిల్జిత్ దోసాంజ్ 'భైరవ అంథమ్' రిలీజ్

షో రీల్ తో ఆకట్టుకున్న మిస్టర్ బచ్చన్

అంజలి బహిష్కరణ చేసింది ఎవరిని?

సినిమా రంగంలో సవాళ్లు నేపథ్యంగా ఇట్లు... మీ సినిమా

అనుపమ పరమేశ్వరన్ నటిసున్న పరదా లో దర్శన రాజేంద్రన్ పరిచయం

Show comments