Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాష్ట్రంలో విజృంభిస్తున్న స్వైన్‌ఫ్లూ మహమ్మారి

Webdunia
FILE
రాష్ట్రంలో స్వైన్‌ఫ్లూ మహమ్మారి తన పంజా విసురుతోంది. దీంతో రాష్ట్రంలో స్వైన్‌ఫ్లూ వ్యాధి కారణంగా ఇప్పటి వరకు మృతి చెందిన వారి సంఖ్య 20కి చేరింది.

స్వైన్‌ఫ్లూ మహమ్మారి రాష్ట్ర రాజధానిలో మాత్రమే పరిమితమై ఉందని భావిస్తే తప్పులో కాలేసినట్లేనని వైద్యనిపుణులు సూచిస్తున్నారు. ఈ వ్యాధి పొరుగు జిల్లాలకు కూడా పాకుతోంది. గురువారం ఉదయం హైదరాబాదులోని కామినేని ఆస్పత్రిలో చేతన్ అనే యువకుడు స్వైన్ ఫ్లూ లక్షణాలతో మృతి చెందాడు. ఇతను ఖాసి వరంగల్‌కు చెందినవాడని వైద్యాధికారులు తెలిపారు.

తాజాగా నిమ్స్‌లోని ముగ్గురు వైద్యులకు ఈ వ్యాధి సోకినట్లు సమాచారం. కాగా బుధవారం నల్లగొండ జిల్లా ఆత్మకూరు (ఎం) గ్రామానికి చెందిన బొడిగ ఎల్లమ్మ అనే మహిళ స్వైన్‌ఫ్లూతో మరణించింది. నల్లగొండ జిల్లా కలెక్టర్ రిజ్వీకి కూడా స్వైన్ ఫ్లూ సోకింది. ఈ వ్యాధికి ఆయన చికిత్స చేయించుకుంటున్నారు.

కృష్ణా జిల్లా జగ్గయ్యపేట ఇటీవల ఒక చిన్న పిల్లల వైద్యనిపుణుడు మృతి చెందాడు. అతను స్వైన్‌ఫ్లూ కారణంగానే మృతి చెందినట్లు పలువురు అనుమానిస్తున్నారు.

దీంతో బుధవారంనాడు హైదరాబాద్‌లో స్వైన్‌ప్లూ వ్యాధికి సంబంధించి పరీక్షల నిమిత్తం దాదాపు 770 మంది ఆస్పత్రులకు వచ్చి పరీక్ష చేయించుకున్నట్లు ప్రాథమిక సమాచారం. వీరిలో 50 మంది నుంచి నమూనాలను సేకరించారు. మిగిలిన 22 మందికి స్వైన్‌ఫ్లూ లక్షణాలున్నట్లు నిర్ధారణ అయ్యిందని వైద్యులు తెలిపారు.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

అమెరికాలో దారుణం... ఇండోఅమెరికన్‌ ముఖంపై ఒకే ఒక గుద్దుతో మృతి (video)

ఘాట్ రోడ్డులో మహిళను చంపేసిన చిరుతపులి

వివాహ విందు: చికెన్ బిర్యానీలో లెగ్ పీసులు ఎక్కడ..? కొట్టుకున్న అతిథులు!

భార్య స్టెల్లాను పైకెత్తుకుని ముద్దెట్టిన జూలియన్ అసాంజే

స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్‌లో గద్దలు... రూ.2096 కోట్ల నిధులుంటే.. మిగిలింది రూ.7 కోట్లే...

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కమిటీ కుర్రోళ్ళు నుంచి ‘ప్రేమ గారడీ..’ లిరిక‌ల్ సాంగ్ విడుద‌ల‌

సమంతను పక్కనబెట్టి రష్మికను తీసుకున్న బిటౌన్?

అరవింద్ కృష్ణ SIT.. ఆశ్చర్యపరుస్తున్న సూపర్ హీరో లుక్

14 చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ లాంచ్

అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ 39 సంవత్సరాల తర్వాత చేస్తున్న కల్కి 2898 AD

Show comments