Webdunia - Bharat's app for daily news and videos

Install App

టేస్టీ స్వీట్... బాదంపప్పు-ఎండుఖర్జూరం పాయసం

Webdunia
శుక్రవారం, 29 అక్టోబరు 2021 (23:01 IST)
బాదం పప్పుల్లో బ్లీచింగ్‌ కారకాలు అధికం. ఇవి చర్మంలోని మృతకణాలను తొలగిస్తాయి. పెద్దపేగులోని సమస్యలకు ఖర్జూరం పండులోని టానిన్‌ చక్కగా ఉపయోగపడుతుంది. గొంతునొప్పి, మంట, జలుబు, శ్లేష్మం లాంటివాటికి ఈ పండు గుజ్జు లేదా సిరప్‌ మంచి మందు. అలాగే డయేరియా, మూత్రాశయ సమస్యల్ని నివారించేందుకు దీని కాండం నుంచి తీసిన జిగురును వాడతారు. చెట్టువేళ్లను నూరి పెట్టుకుంటే పంటినొప్పీ తగ్గుతుంది.
 
కావలసిన పదార్థాలు :
ఎండు ఖర్జూరం తరుగు.. పావు కప్పు
బాదం పప్పు.. పావు కప్పు
ఎండుకొబ్బరి కోరు.. పావు కప్పు
పాలు.. మూడు కప్పులు
కలాకండ్.. ఒక టీ.
పంచదార.. పావు కప్పు
మరిగించి చల్లార్చిన పాలు.. అర కప్పు
యాలకుల పొడి.. అర టీ.
 
తయారీ విధానం :
తరిగిన ఖర్జూరం, బాదంపప్పులను, ఎండుకొబ్బరి కోరును పేస్టులాగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని కలాకండ్‌తోపాటు పాలల్లో కలిపి సన్నటి సెగమీద వేడి చేయాలి. మిశ్రమం చిక్కబడుతుండగా పంచదార, మరిగించిన పాలు కలపాలి. పంచదార బాగా కరిగిన తరువాత యాలకుల పొడి వేసి దించేసి.. వేడి వేడిగా సర్వ్ చేయాలి. అంతే ఖర్జూరం, బాదంలతో తయారైన పాయసం సిద్ధమైనట్లే..!

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments