Webdunia - Bharat's app for daily news and videos

Install App

శనగపప్పుతో కుడుములు ఎలా చేయాలి?

Webdunia
గురువారం, 26 మే 2016 (14:59 IST)
సాధారణంగా శనగపప్పులో ఫైబర్ ఉంటుంది. ఈ పప్పును డైట్‌లో చేర్చుకోవడం ద్వారా శరీరానికి కావలసిన పోషకాలు లభిస్తాయి. అలాంటి శనగపప్పుతో నూనె పదార్థాలు కాకుండా ఆవిరి మీద ఉడికించే కుడుములు ఎలా తయారు చేయాలో చూద్దాం..!
 
కావలసిన పదార్థాలు: 
శనగపప్పు - 1 కప్పు
బెల్లం - ఒక కప్పు 
బియ్యంపిండి - 2 కప్పులు
తాజా కొబ్బరి తురుము -1 కప్పు
యాలకుల పొడి -  తగినంత
నెయ్యి - తగినంత
 
తయారీ విధానం: 
శనగపప్పులో తగినంత నీరు పోసి కుక్కర్‌లో ఉడికించుకోవాలి. పప్పు మరీ మెత్తగా కాకుండా మితంగా ఉడికించుకోవాలి. ఉడికించిన తరువాత పప్పును చల్లార్చి పొడి చేసుకోవాలి. ఒక గిన్నెలో బెల్లం, నీళ్లు పోసి పాకం పట్టాలి. ఆ పాకంలో శనగపప్పు పొడి, యాలకుల పొడి, కొబ్బరి తురుము వేసుకుని కలుపుకోవాలి. ఈ మిశ్రమం చిక్కబడేవరకూ సన్నని మంటపై ఉడికించుకోవాలి. మిశ్రమం గట్టిపడ్డాక స్టవ్ ఆర్పేయాలి. 
 
ఈ మిశ్రమాన్ని ఉండలు కట్టుకుని పక్కనుంచుకోవాలి. ఇంకొక పాత్రలో నీళ్లు, నెయ్యి, వేసి మరిగించాలి. బియ్యంపిండిని ఓ గిన్నెలో తీసుకుని మరిగించిన నీటిని చేర్చుతూ పిండి కలుపుకోవాలి. ఇప్పుడు చేతికి నూనె పూసుకుని పిండిని ఉండలుగా చేసుకోవాలి. ఉండలను చేయితో చిన్న పూరీల్లా వత్తుకుని వాటి మధ్యలో శనగపిండి ఉండను ఉంచి గుండ్రంగా చుట్టాలి. ఇలా తయారుచేసిపెట్టుకున్న కుడుములను 10 -12 నిమిషాలపాటు ఆవిరి మీద ఉడికించి చల్లారాక వడ్డించాలి. అంతే కుడుములు రెడీ.

టీడీపీకి ఓటు వేశాడని ఓటరు చెవి కోసేసిన వైకాపా నేత!!

భార్య మార్పిడి.. నా ఫోటోలను స్నేహితులకు పంచుకున్నాడు.. ఆపై..?

ఆ రోజు సీఎం కేజ్రీవాల్ నివాసంలో ఏం జరిగిందంటే.. నోరు విప్పిన ఎంపీ స్వాతి మలివాల్

కూటమికి 120-150 ఎమ్మెల్యే స్థానాల్లో గెలుపు.. ఆర్ఆర్ఆర్ స్పీకరవుతారా?

యాంకర్‌పై పూజారి అత్యాచారం.. తీర్థంలో నిద్రమాత్రలు.. బెంజ్ కారులో..?

పెళ్లిపీటలెక్కనున్న హీరో ప్రభాస్.. ట్వీట్ చేసిన బాహుబలి!!

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

తర్వాతి కథనం
Show comments