Webdunia - Bharat's app for daily news and videos

Install App

నోరూరించే నువ్వుల లడ్డూ తయారీ ఎలా?

Webdunia
బుధవారం, 27 జనవరి 2016 (14:54 IST)
భారతీయ వంటకాల్లో చాలా అరుదుగా వినియోగించే పదార్థాల్లో నువ్వులు ఒకటి. వీటిని కేవలం పండుగల సమయాల్లో మాత్రమే ఎక్కువగా వాడుతారు. వీటితో తయారుచేసే ఆహారాలు ఆరోగ్యానికి ఎంతో మేలును చేస్తుంది. నువ్వుల్లో ఫ్లేవనాయిడ్, ఫినోలిక్ యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్స్, డైటేరియన్ ఫైబర్ వంటివి పుష్కలంగా దొరుకుతుంది. ఇన్ని పోషకాలు కలిగిన ఈ నువ్వులు డయాబెటిస్, ఓరల్ హెల్త్, జలబు, చుండ్రు, చర్మ తదితర సమస్యలను తగ్గించడంలో కీలకపాత్రను పోషిస్తుంది. ఇలా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలిగించే ఈ నువ్వులతో లడ్డూలు చేసుకుని తింటే ఎంతో శ్రేయస్కరం. మరి.. వాటిని ఎలా చేస్తారో తెలుసుకుందామా.
 
కావలసిన పదార్థాలు :
నల్లనువ్వులు - 1 కప్పు 
బెల్లం - అరకప్పు 
ఖర్జూరం - అరకప్పు
జీడిపప్పు - అరకప్పు 
ఎండు ద్రాక్ష -  అరకప్పు 
ఎండుకొబ్బరి తురుము - 1/4 కప్పు 
వేరుశెనగపప్పు- అరకప్పు 
యాలకులు - తగినంత 
నెయ్యి - తగినంత 
 
తయారు చేసే విధానం :
ముందుగా స్టౌవ్ మీద పాత్ర పెట్టి అందులో కొద్దిగా నెయ్యి వేసి వేడిచేయాలి. వేడైన తర్వాత అందులో నువ్వులు వేసి దోరగా వేయించి పక్కన పెట్టుకోవాలి. అదేపాత్రలో వేరుశెనగపప్పు, జీడిపప్పు కూడా విడివిడిగా వేయించి పక్కన పెట్టుకోవాలి. ఇలా వేయించి పెట్టుకున్న నువ్వులు, వేరు శెనగపప్పు, జీడిపప్పులను మిక్సీలో వేసి పొడిగా చేసుకోవాలి. అలాగే యాలకులు, బెల్లం కూడా పొడి చేసుకోవాలి. 
 
ఇప్పుడు ఖర్జూరం మిక్సీలో వేసి మెత్తగా చేసుకోవాలి. తర్వాత ఖర్జూరం ముద్దలో నువ్వుల పొడి, పల్లీలతో చేసిన పొడి, బెల్లంపొడి, కొబ్బరి తురుము కూడా వేసి కలపాలి. తర్వాత చేతికి కరిగించిన నెయ్యి రాసుకుంటూ ఈ మిశ్రమాన్ని ఉండల్లా చేసుకోవాలి. వీటిని గాలి తగలని డబ్బాలోకి తీసుకుంటే 15 రోజుల వరకూ నిల్వ ఉంటాయి. అంతే తియ్యనైన నువ్వుల లడ్డులు రెడీ. 

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు- టీడీపీ+ కూటమికి ఎన్ని సీట్లు?

వైసీపీ కేవలం ఐదు ఎంపీ సీట్లు మాత్రమే గెలుచుకుంటుందా?

తూర్పు రైల్వేలో AIతో నడిచే వీల్ ప్రిడిక్షన్ సాఫ్ట్‌వేర్

నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం- ఏపీ, తెలంగాణల్లో భారీ వర్షాలు

అన్నయ్య లండన్‌కు.. చెల్లెమ్మ అమెరికాకు..!

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

Show comments