Webdunia - Bharat's app for daily news and videos

Install App

పిల్లలకు నచ్చే సేమియా పాయసం!

Webdunia
సోమవారం, 1 డిశెంబరు 2014 (14:20 IST)
పిల్లలకు నచ్చే రిసిపిల్లో ఒకటైన సేమియా పాయసంను టేస్టీగా చేయాలంటే ఇలా ట్రై చేయండి. 
 
కావల్సిన పదార్థాలు:
సేమియా: నాలుగు కప్పులు 
నెయ్యి: రెండు చిన్న కప్పులు 
యాలకలు: ఆరు
లవంగాలు: నాలుగు 
పంచదార: రెండు కప్పులు 
బాదం, పిస్తా : చెరో పదేసి 
కుంకుమపువ్వు: 1 చిటికెడు
పాలు: నాలుగు కప్పులు 
 
తయారీ విధానం : 
ముందుగా డీప్ బాటమ్ పాన్‌లో కొద్దిగా నెయ్యి వేసి వేడి చేయాలి. నెయ్యి కరిగిన తర్వాత అందులో యాలకలు, లవంగాలు ఒక సెకను ఫ్రై చేయాలి. తర్వాత వీటిని ఒక ప్లేట్‌లో తీసి పక్కన పెట్టుకోవాలి. అలాగే సేమియాను కూడా అదే పాన్‌లో వేసి ఫ్రై చేసుకోవాలి.
 
సేమియా పూర్తిగా బ్రౌన్ కలర్‌కు మారకుండా 5నిముషాలు చాలా తక్కువ మంట మీద ఫ్రై చేసుకోవాలి. అంతలోపు పాన్‌లో రెండు కప్పుల నీళ్ళు పోసి, నీరు మరుగుతున్నప్పుడు అందులో పంచదార వేసి, బాగా మరిగించాలి. పంచదార సిరఫ్ చిక్కగా మారే వరకూ పది నిముషాల ఉడికించాలి. షుగర్ సిరఫ్ రెడీ అయ్యాక అందులో ముందుగా ఫ్రై చేసి పెట్టుకొన్న సేమియాను వేసి, రెండు మూడు కప్పుల పాలు పోసి మొత్తం మిశ్రమాన్ని ఉడికించాలి. 
 
5నిముషాలు ఉడికించిన తర్వాత పాలు కొద్దిగా క్రీమీగా తయారవుతుంది. అప్పుడు ఫ్రై చేసుకొన్న లవంగాలు, యాలకులు వేసి మిక్స్ చేసి బాదం, పిస్తాతో గార్నిష్ చేయాలి. అంతే స్టౌ ఆఫ్ చేసి, చల్లారిన తర్వాత ఫ్రిజ్‌లో పెట్టి చల్లగా అయినా వేడిగా అయినా సర్వ్ చేయవచ్చు. 

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ప్రజల్ వీడియోలు : సస్పెండ్ చేసిన జేడీఎస్

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు : టీడీపీ - జనసేన - బీజేపీ ఉమ్మడి మేనిఫెస్టో ముఖ్యాంశాలు ఇవే..

బీజేపీ రాజ్యాంగ పుస్తకాన్ని విసిరివేయాలనుకుంటోంది.. రాహుల్ గాంధీ ఫైర్

విజయవాడలో దారుణం : ఇంటిలో రక్తపు మడుగులో నాలుగు శవాలు.. ఇంటి బయట మరో శవం..

కోకో చెట్లను తుడిచిపెట్టే వినాశకరమైన వైరస్

రేపటి నుండి పుష్పపుష్ప జపం చేస్తారంటూ తాజా అప్డేట్ ఇచ్చిన సుకుమార్

విరాజ్ అశ్విన్ క్లాప్ తో ఆర్ట్ మేకర్స్ చిత్రం ప్రారంభం

ఐవీఎఫ్ ద్వారా తల్లి కాబోతోన్న మెహ్రీన్...

డీప్ ఫేక్ వీడియో కేసు.. ముంబైకి వెళ్లిన రష్మిక మందన్న.. ఎందుకో తెలుసా?

ధర్మం కోసం యుద్ధం ప్రకటించిన హరిహర వీరమల్లు - తాజా అప్ డేట్

Show comments