Webdunia - Bharat's app for daily news and videos

Install App

"అనాస-జీడిపప్పు హల్వా" తయారీ ఎలా?

Webdunia
సోమవారం, 29 సెప్టెంబరు 2014 (18:01 IST)
కావలసిన పదార్థాలు :
అనాసపండు తురుము.. నాలుగు కప్పులు
పచ్చికొబ్బరి తురుము.. ఒక కప్పు
పంచదార.. రెండు కప్పులు
జీడిపప్పులు.. అరకప్పు
బాదంపప్పు.. పావు కప్పు
పిస్తా పప్పులు.. కాసిన్ని
కోవా.. అర కప్పు
ఎల్లో ఫుడ్ కలర్.. ఆరు చుక్కలు
ఫైనాఫిల్ ఎసెన్స్.. ఆరు చుక్కలు
నెయ్యి.. రెండు టీస్పూన్లు
 
తయారీ విధానం :
ఒక పాత్రలో నెయ్యి వేడయ్యాక బాదంపప్పు, జీడిపప్పు, పిస్తా పప్పులను వేసి దోరగా వేయించి పక్కనుంచాలి. అదే పాత్రలో అనాసపండు తురుము, కొబ్బరి తురుములను ఒకదాని తర్వాత ఒకటి వేసి ఐదు నిమిషాలపాటు వేయించాలి. దానికి పంచదారను కూడా జతచేసి మరో ఐదు నిమిషాలు వేయించాలి. తర్వాత కోవా కలిపి రెండు నిమిషాలు ఉడికించి దించేయాలి. చల్లారిన తర్వాత నేతిలో వేయించి జీడి, బాదం, పిస్తా పప్పులతో అందంగా అలంకరించి సర్వ్ చేస్తే సరి..! అంతే రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యాన్నిచ్చే అనాస హల్వా తయార్..! 

చోటు లేదని కారు టాప్ పైన ఎక్కి కూర్చున్న యువతి, రద్దీలో రయ్యమంటూ ప్రయాణం

కదులుతున్న బస్సులో మంటలు- తొమ్మిది మంది సజీవదహనం

ఖమ్మం: తల్లి, ఇద్దరు పిల్లలను హత్య చేసిన వ్యక్తి.. భార్య కూడా?

సాధారణ మహిళలా మెట్రోలో నిర్మలా సీతారామన్ జర్నీ.. వీడియో వైరల్

కేరళలో విజృంభిస్తున్న హెపటైటిస్ ఏ- 12 మంది మృతి.. లక్షణాలు

పవన్ కల్యాణ్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన రేణు దేశాయ్

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

Show comments