Webdunia - Bharat's app for daily news and videos

Install App

న్యూ ఇయర్ స్పెషల్... పసందైన పన్నీర్ డ్రైఫ్రూట్ పాయసం

Webdunia
గురువారం, 31 డిశెంబరు 2015 (14:57 IST)
పండుగలు వచ్చిందంటే మనకు మొదట గుర్తుకొచ్చేది పాయసం. దీన్నే కొంచెం స్పెషల్‌గా తయారుచేసుకుందాం! పనీర్, పచ్చికొబ్బరి రెండూ అందరికీ ఇష్టమే. ఈ రెండూ కలిపి చేసే ఈ పాయసం ఎంతో రుచిగా ఉండడం మాత్రమే కాకుండా ఆరోగ్యానికి కూడా మంచిది. దీని తయారీకి కావాల్సిన పదార్థాలను పరిశీలిస్తే... 
 
కావలసిన పదార్థాలు:
పాలు.. లీటరు 
పనీర్.. ఒక కప్పు 
కొబ్బరితురుము.. అర కప్పు
పంచదార.. ఒక కప్పు 
యాలకుల పొడి.. అర స్పూన్
శాఫ్రాన్.. కొద్దిగా
నెయ్యి.. తగినంత
ఎండు ద్రాక్షలు.. కొద్దిగా
జీడిపప్పు, బాదం, పిస్తా.. సరిపడా.  
 
తయారు చేసే విధానం:
ముందుగ స్టౌవ్ వెలిగించి పాత్రలో పాలను పోసి మరిగించాలి. ఇందులో పనీర్ తురుము, కొబ్బరితురుము వేసి ఉడికించాలి. పంచదార కూడా వేసి కలిపి స్టౌవ్ సిమ్‌లో ఉంచి మిశ్రమం చిక్కగా అయ్యేవరకు ఉడికించి యాలకులపొడి వేయాలి. ఇంకో పాత్రలో ఒక స్పూన్ నెయ్యి వేడిచేసి ఎండు ద్రాక్షలు, జీడిపప్పు, బాదం, పిస్తా వేయించాలి. వీటిని మరిగించిన పాలలో కలపాలి. ఖీర్ బాగా చిక్కగా కావాలంటే కొంచెం కోవా వేసుకోవచ్చు. అంతే పసందైన పన్నీర్ డ్రైఫ్రూట్ పాయసం రెడీ. వేడిగా తాగాలనుకుంటే అలాగే తాగొచ్చు లేదంటే  ఫ్రిజ్‌లో ఉంచి చల్లగా తాగితే ఇంకా బాగుంటుంది.

సాధారణ మహిళలా మెట్రోలో నిర్మలా సీతారామన్ జర్నీ.. వీడియో వైరల్

కేరళలో విజృంభిస్తున్న హెపటైటిస్ ఏ- 12 మంది మృతి.. లక్షణాలు

స్వాతి మలివాల్‌పై కేజ్రీవాల్ సహాయకుడి దాడి.. ఆ నొప్పిలో వున్నా?

రాత్రంతా మహిళతో మాట్లాడాడు.. రూ. 60 లక్షలు ట్రాన్స్‌ఫర్ చేసుకున్నాడు...

సంతోషిమాత అమ్మవారికి కేజీ బరువున్న వెండి చక్రం

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

పాయల్ రాజ్‌ పుత్‌తో ప్రభాస్ పెళ్లి.. డార్లింగ్‌గా ఉంటాను?

Show comments