దీపావళి స్పెషల్: మోతిచర్ లడ్డూ ఎలా చేయాలో తెలుసా?

Webdunia
గురువారం, 24 అక్టోబరు 2019 (15:46 IST)
దీపావళి నోరూరించే లడ్డూలను ఇంట్లోనే తయారు చేసుకోండి. ఇంట్లోనే తక్కువ సమయంలో ఈ లడ్డూలను చేసేయొచ్చు. అయితే ఎప్పుడూ బూందీ లడ్డూతో బోర్ కొట్టేసిందా.. అయితే నార్తిండియన్ స్టైల్‌లో మోతిచర్ లడ్డూ ఎలా చేయాలో చూద్దాం.. 
 
కావలసిన పదార్థాలు : 
 
శెనగ పిండి - 3 కప్పులు 
 
పిస్తా, బాదాం పప్పులు - అర కప్పు 
 
పాలు - ఒకటిన్నర లీటరు 
 
యాలకుల పొడి - రెండు టీ స్పూన్లు 
 
నెయ్యి - రెండు కప్పులు
 
పంచదార - మూడు కప్పులు 
 
తయారీ విధానం : 
ముందుగా వెడల్పాటి బాణలి పంచదారకు తగినన్ని నీటిని చేర్చి పాకం పట్టాలి. ఈ పాకంలో పాలను కలిపి పొంగి వచ్చిన తర్వాత యాలకుల పొడిని చేర్చాలి. పాకాన్ని స్టౌ మీద నుంచి దించేసి.. సిద్ధంగా ఉంచిన శెనగపిండిలో, పాలను కలిపి బూందీకి తగ్గట్లు కలుపుకోవాలి.
 
పాన్‌లో నెయ్యిని పోసి వేడయ్యాక.. జారుగా కలిపివుంచిన శెనగపిండి మిశ్రమాన్ని బూందీ రూపంలో జారనివ్వండి. బూందీలను బంగారం రంగు వచ్చేంతవరకు వేయించి మరో ప్లేటులోకి తీసుకోవాలి. ఈ బూందీలను సిద్ధంగా ఉంచుకున్న పాకంలో కలుపుకుని ఈ మిశ్రమాన్ని కొద్దిగా వేడినీటిని కలిపి లడ్డూలుగా చుట్టుకోవాలి. అంతే నోరూరించే మోతిచర్ లడ్డూ రెడీ అయినట్లే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

ఇరాన్ - అమెరికా దేశాల మధ్య యుద్ధ గంటలు... ఇరాన్‌కు వెళ్లొద్దంటూ భారత్ విజ్ఞప్తి

కేసీఆర్‌ను విమర్శించేందుకు ఆయన కుమార్తె కవిత ఉన్నారు : మంత్రి కోమటిరెడ్డి

మహిళలపై వ్యక్తిత్వ దాడికి పాల్పడటం సరికాదు : సీపీ సజ్జనార్

ప్రయత్నాలు విఫలమైనా ప్రార్థనలు ఎన్నిటికీ విఫలం కావు : డీకే శివకుమార్

శాంతి, సామరస్యం ఉన్నచోట రోజూ పండుగే : పవన్ కళ్యాణ్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జూమ్ కాల్‌లో బోరున విలపించిన యాంకర్ అనసూయ

బాక్సాఫీస్ వద్ద 'మన శంకరవరప్రసాద్ గారు' దూకుడు

ఒక వర్గానికి చెందిన అభిమానులు పరాశక్తిపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు : దర్శకురాలు సుధా కొంగరా

Anasuya: పోలీసులను ఆశ్రయించిన అనసూయ.. 42 మందిపై ఫిర్యాదు.. ఎందుకో తెలుసా?

మన శంకర వర ప్రసాద్ గారులో రాసిన ప్రతి సీన్‌కి ఇన్స్పిరేషన్ చిరంజీవి గారే : అనిల్ రావిపూడి

తర్వాతి కథనం
Show comments